హైదరాబాద్ పంజాగుట్టలో దారుణం... చెత్తకుప్పలో పసికందు

చిన్నారి ఏడుపు విన్న స్థానికులు ప్లాస్టిక్ కవర్లో ఉన్న పసికందును గుర్తించి వెంటనే బయటకు తీశారు.

news18-telugu
Updated: October 16, 2019, 3:45 PM IST
హైదరాబాద్ పంజాగుట్టలో దారుణం... చెత్తకుప్పలో పసికందు
చెత్తకుప్పలో ఆడపిల్ల
  • Share this:
హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును చెత్తకుప్పలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో చిన్నారి ఏడుపు విన్న స్థానికులు ప్లాస్టిక్ కవర్లో ఉన్న పసికందును గుర్తించి వెంటనే బయటకు తీశారు.నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతోనే పసిప్రాణాన్ని చెత్త కుప్పలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పాపను ఎవరు వదిలి వెళ్లి ఉంటారన్న దానిపై విచారణ చేస్తున్నారు.

ఇవికూడా చదవండి:
దొంగకు దేహశుద్ధి చేసిన ఇద్దరమ్మాయిలుFirst published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>