Home /News /crime /

అమరావతి సచివాలయం నుంచి నేరుగా గ్రామ వలంటీర్ కు ఫోన్ కాల్.. చివరకు జరిగింది చూసి అంతా షాక్..!

అమరావతి సచివాలయం నుంచి నేరుగా గ్రామ వలంటీర్ కు ఫోన్ కాల్.. చివరకు జరిగింది చూసి అంతా షాక్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ వలంటీర్ కు మార్చి 20వ తారీఖున ఓ ఫోన్ కాల్ వచ్చింది. అమరావతి సచివాలయం నుంచి మాట్లాడుతున్నామనీ, ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా? అంటూ అవతలి వ్యక్తి ఆరా తీశాడు. ఆ తర్వాత..

    సైబర్ నేరగాళ్లు రూటు మార్చుతున్నారు. మాయ మాటలతో జనాలను ఏమార్చుతున్నారు. సామాన్య జనాల అకౌంట్లలో డబ్బును కొల్లగొడుతున్నారు. మొన్నటి వరకు ఓటీపీ అనీ, సిమ్ బ్లాక్ అవబోతోందనీ, ఏటీఎం కార్డు ఎక్స్పైరీ అవబోతోందంటూ భయపెట్టి డబ్బు మాయం చేశారు. ఈ విషయాలపై ప్రజల్లో పోలీసులు అవగాహన తెస్తుండటంతో సైబర్ చోరులు కూడా రూటుమార్చారు. తాజాగా ప్రభుత్వ పథకాలను కూడా సైబర్ నేరాలకు వాడుకుంటున్న ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. అమరావతి సచివాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ వలంటీర్ కు ఫోన్ చేశారు. ప్రభుత్వ పథకాలు అందరికీ వస్తున్నాయా? అంటూ ఆరా తీశారు. ఓ కుటుంబంలో అమ్మఒడి పడలేదంటూ అతడు చెప్పడంతో వాళ్ల ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు. వాళ్లతో మాట్లాడి, ఏమార్చి రూ.13 వేల రూపాయలను లూటీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

    గన్నవరం పట్టణంలోని ఓ వలంటీర్ కు మార్చి 20వ తారీఖున ఓ ఫోన్ కాల్ వచ్చింది. అమరావతి సచివాలయం నుంచి మాట్లాడుతున్నామనీ, ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా? అంటూ అవతలి వ్యక్తి ఆరా తీశాడు. పెన్షన్ ఎంత మందికి వస్తోంది, ఎంత మందికి సొంతిళ్లు ఉన్నాయి? అంటూ ప్రశ్నలు వేశాడు. వలంటీర్ అన్ని వివరాలు చెప్పి, తన పరిధిలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఓ కుటుంబానికి అమ్మ ఒడి పథకం డబ్బులు పడలేదని చెప్పి వాపోయాడు. అవునా? వాళ్ల ఫోన్ నెంబర్ ఓసారి చెప్పండి అంటూ అవతలి వ్యక్తి అడిగాడు. దీంతో విద్యార్థి తండ్రి ఫోన్ నెంబర్ ను వలంటీర్ చెప్పాడు. సైబర్ నేరగాడు విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి, వలంటీర్ కు కూడా కాన్ఫరెన్స్ కలిపాడు. వారిద్దరితోనూ అమ్మఒడి డబ్బుల గురించి కొద్దిసేపు మాట్లాడి, వలంటీర్ ఫోన్ ను సైబర్ నేరగాడు కట్ చేశాడు.
    ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ

    ఆ తర్వాత విద్యార్థి తండ్రితోనే మాట్లాడసాగాడు. ‘ మీ వివరాలు చెక్ చేశాం. కొద్ది గంటల్లోనే మీ ఖాతాలో అమ్మఒడి డబ్బులు పడతాయి. అయితే టెక్నికల్ సమస్యల కారణంగా ముందుగా మీరు మా అకౌంట్లోకి డబ్బులు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ డబ్బులతో సహా, అమ్మఒడి డబ్బులు మీ ఖాతాలో పడతాయి.‘ అంటూ నమ్మబలికాడు. దీన్ని నమ్మిన ఆ విద్యార్థి తండ్రి విడతల వారీగా రూ.4వేలు, రూ.9వేలు పంపాడు. ఇంకా పంపమని అవతలి వ్యక్తి అడగటంతో, తన దగ్గర ఇంతే ఉన్నాయని విద్యార్థి తండ్రి చెప్పాడు. దీంతో సైబర్ నేరగాడు ఆ ఫోన్ కాల్ ను కట్ చేశాడు. మళ్లీ ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో వెంటనే వలంటీర్ కు ఫోన్ చేశాడు. విషయం చెప్పాడు. ‘నాకు చెప్పకుండా వాళ్లకు డబ్బులు ఎందుకు పంపావు. ఏ పథకానికి డబ్బులు అడగరు. ఇదో మోసంలా కనిపిస్తోంది’ అంటూ చెప్పి విద్యార్థి తండ్రితో సహా వచ్చి విజయవాడ సైబర్ క్రైమ్ లో సోమవారం ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు