• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • NEW TYPE OF CYBER CRIME HYDERABAD MAN LOSES FIXED DEPOSIT MONEY WITHOUT HIS KNOWLEDGE FULL DETAILS HERE HSN

Hyderabad: వామ్మో.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లనూ వదలడం లేదు.. సైబర్ నేరగాళ్ల మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ లో ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం..!

Hyderabad: వామ్మో.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లనూ వదలడం లేదు.. సైబర్ నేరగాళ్ల మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ లో ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం..!

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లో బయటపడిన ఓ సైబర్ నేరం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసిన వారిని కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్లో పది లక్షల రూపాయల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసుకున్నాడు. కానీ..

  • Share this:
    ‘హమ్మయ్య.. ఉన్న డబ్బులన్నీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేశాను. ఇక నా డబ్బు సేఫ్. దొంగలు కాదు కదా సైబర్ నేరగాళ్లు కూడా ఏమీ చేయలేరు‘ అని అనుకునేవాళ్లకు ఓ షాకింగ్ న్యూస్. చోరీకి కాదేదీ అసాధ్యం అన్నట్టుగా సైబర్ నేరగాళ్లు రూటు మార్చుతున్నారు. ఓటీపీ పేరుతో సేవింగ్స్ ఖాతాలను గుల్ల చేస్తున్న మోసగాళ్లు, తాజాగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కూడా కన్నేశారు. తెలివిగా ఆ డబ్బును కూడా ఖాళీ చేస్తున్నారు. ఖాతాదారులకు తెలియకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ సొమ్మును మాయం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో బయటపడిన ఓ సైబర్ నేరం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసిన వారిని కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్లో పది లక్షల రూపాయల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసుకున్నాడు. సడన్ గా అతడి అకౌంట్లో ఆ డబ్బు మాయమైనట్టుగా కనిపించింది. ఇదేంటని బ్యాంకు వాళ్లను నిలదీస్తే అసలేం జరిగిందో వాళ్లు వివరంగా చెప్పుకొచ్చారు.

    ‘ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసిన సొమ్మును మీరు సేవింగ్స్ ఖాతాలోకి ట్రాన్సఫర్ చేయాల్సిందిగా మమ్మల్ని ఫోన్ ద్వారా రిక్వెస్ట్ పెట్టారు. మా దగ్గర ఉన్న మీ ఫోన్ నెంబర్, మాకు కాల్ వచ్చిన ఫోన్ నెంబర్ రెండూ మ్యాచ్ అయ్యాయి. అందుకే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ డబ్బులను సేవింగ్స్ ఖాతాలోకి బదిలీ చేశాం. ఆ డబ్బును మీరు కూడా వాడుకోలేదంటున్నారు. కాబట్టి వెంటనే సైబర్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేయండి. ఇదో కొత్త తరహా మోసం లాగా ఉంది‘ అంటూ బ్యాంకు అధికారులు తేల్చిచెప్పారు. తన ప్రమేయం లేకుండా, తాను ఫోన్ చేయకుండానే బ్యాంకు అధికారులకు ఎలా తన నెంబర్ నుంచి ఫోన్ వెళ్లిందా? అనేది తెలియక అతడు లబోదిబో అంటున్నాడు.
    ఇది కూడా చదవండి: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!

    అయితే అసలు ఇలా ఎలా జరిగిందా అని సైబర్ పోలీసులు ఆరా తీస్తే అసలు నిజం తెలిసింది. సేవింగ్స్ ఖాతాలో డబ్బులు ఉంటే వాటిని ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ గా మార్చుకునే ఫెసిలిటీ ఉంది. అదే విధంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను సేవింగ్స్ ఖాతాలోకి మళ్లించుకోవచ్చు కూడా. దీనిక వన్ టైమ్ పాస్ వర్డ్ లాంటివి ఏమీ లేదు. దీన్నే సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కస్టమర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను స్పూఫ్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు, నేరుగా బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి ఇలా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్న ఖాతాదారులు ఫోన్ బ్యాంకింగ్ ను వాడకపోవడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. ఫోన్ బ్యాంకింగ్ ను వాడకపోయినట్టయితే ఫోన్ నెంబర్ ను స్పూఫ్ చేసినా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ను రద్దు చేయలేరు.
    ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు