Sravani Suicide Case: శ్రావణి ఆత్మహత్య కేసు విచారణలో కొత్త ట్విస్ట్..

Sravani Suicide Case: కేసును మరింత లోతుగా విచారించిన తరువాతే పోలీసులు ఈ రకమైన మార్పులు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

news18-telugu
Updated: September 16, 2020, 10:33 AM IST
Sravani Suicide Case: శ్రావణి ఆత్మహత్య కేసు విచారణలో కొత్త ట్విస్ట్..
నటి శ్రావణి ఫైల్ ఫోటో ( Twitter)
  • Share this:
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణ అనేక మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. చివరకు ఈ కేసులో సాయికృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, దేవరాజ్ రెడ్డిలను ఏ1, ఏ2, ఏ3లుగా పోలీసులు ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. అయితే రిమాండ్ రిపోర్ట్‌లో మాత్రం దేవరాజ్‌ను ఏ1, అశోక్ రెడ్డి ఏ2, సాయికృష్ణారెడ్డి ఏ3గా చేర్చారు. కేసును మరింత లోతుగా విచారించిన తరువాతే పోలీసులు ఈ రకమైన మార్పులు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణి ఎంతగా కోరినా దేవరాజ్ ఒప్పుకోలేదని.. ఈ కారణంగానే శ్రావణి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు సెప్టెంబర్ 7న పంజాగుట్టలోని శ్రీకన్య హోటల్‌లో జరిగిన గొడవపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దేవరాజ్ తమ కూతురిని వేధించాడని శ్రావణి కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పడం కూడా అతడిని ఏ1గా చేర్చడానికి మరో కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నెల 9న హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్‌లో నివసిస్తున్న శ్రావణి బాత్రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూమ్‌లోకి వెళ్లిన శ్రావణి ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా శ్రావణి స్పృహ కోల్పోయి ఉంది. అది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను యశోద హాస్పిటల్‌కు తరలించారు. శ్రావణిని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని తేల్చారు.
Published by: Kishore Akkaladevi
First published: September 16, 2020, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading