Home /News /crime /

NEW TWIST IN MUMBAI GIRL MURDER CASE POLICE SUSPECT TRIANGLE LOVE STORY LEADS TO CRIME HSN

Mumbai Girl Murder Mystery: యువతి మర్డర్ మిస్టరీలో కొత్త ట్విస్ట్.. ప్రియుడు వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటే చూడటం వల్లే..!

శ్రీ జోగ్డాన్కర్ (ఫైల్ ఫొటో)

శ్రీ జోగ్డాన్కర్ (ఫైల్ ఫొటో)

కొత్త ఏడాది తొలిరోజే జరిగిన ఓ యువతి హత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. తన ప్రియుడు మరో యువతితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి, నిలదీయడం వల్లే ఆ యువతి దారుణ హత్యకు గురయిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  కొత్త సంవత్సరం రోజే ఓ యువతి అనుమానాస్పద రీతిలో హత్యకు గురయింది. అర్ధరాత్రి ఇంటి నుంచి తన స్నేహితురాలితో పార్టీకి వెళ్లిన ఆ యువతి తెల్లారేసరికి శవమై కనిపించింది. రక్తపు మడుగులో మర్మాంగాలపై గాయాలతో దారుణమైన రీతిలో ఆమె హత్యకు గురయింది. ఈ దారుణ ఘటనకు ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో జనవరి ఒకటిన జరిగిన ఓ యువతి డెత్ మిస్టరీలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

  ముంబైలో జనవరి ఒకటో తారీఖున ఝాన్వీ ఖుర్కేజా అనే 19 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. శాంటాక్రజ్ ప్రాంతంలో ఉంటున్న ఆ యువతి డిసెంబర్ 31వ తారీఖున రాత్రి ఇంట్లోనే జరిగిన తన తండ్రి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంది. తన కుటుంబంతో కలిసి హ్యాపీగా పార్టీ చేసుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఝాన్వీ ఇంటికి పక్కింట్లో ఉండే తన చిన్ననాటి స్నేహితురాలు 19 ఏళ్ల దియా వచ్చింది. తనతో కలిసి పార్టీకి రావాలని కోరింది. మొదట ఝాన్వీ తిరస్కరించింది. అరగంటలో తిరిగి రావచ్చునని, తానే దగ్గరుండి మరీ పంపిస్తానని ఆమె చెప్పడంతో ఝాన్వీ ఆ పార్టీకి వెళ్లింది. ఆ సమయంలో దియాతో పాటు శ్రీ జోగ్డాన్కర్ అనే 22 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. ఆ పార్టీకి 13 మంది వరకు యువతీ యువకులు హాజరయ్యారు. అర్ధరాత్రి 12.30 గంటలకు పార్టీకి ఝాన్వీ హాజరయ్యింది. సుమారు 1.30గంటలకు ఝాన్వీ, శ్రీ, దియా మధ్య గొడవ మొదలయింది. పరస్పరం ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఝాన్వీ తలను గోడకు పలుమార్లు ఢీకొట్టేలా చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అంతేకాక ఆమె మర్మాంగాలపై కూడా దాడి చేశారు. ఇంత జరుగుతున్నా పార్టీకి హాజరయిన వారికి ఈ విషయం తెలియకపోవడం శోచనీయం. రెండో అంతస్తు వరకు ఆమెను కొట్టుకుంటూ వచ్చి, ఝాన్వీని అక్కడే వదిలేసి శ్రీ, దియా వెళ్లిపోయారు.

  దాదాపు గంట తర్వాత పార్టీకి వచ్చిన వారిలో ఓ యువకుడు ఆమెను రక్తపు మడుగులో చూసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఈలోపే ఆమె మరణించింది. గంట నుంచి ఆమెకు రక్తస్రావం అవుతూ ఉందనీ, ముందే ఆసుపత్రికి తెచ్చి ఉంటే కాపాడి ఉండేవాళ్లమని పోలీసులు వెల్లడించారు. ఝాన్వీ చనిపోయిన విషయం ఒకటో తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు కుటుంబ సభ్యులకు తెలిసింది. పోలీసులు విచారణ మొదలుపెట్టి సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల్లో శ్రీ చేతికి గాయమయినట్టుగా నడుస్తూ వెళ్లిపోయాడు. అదే విధంగా దియా వస్త్రాలకు రక్తపు మరకలు ఉన్నాయి. ఇద్దరూ ప్లాన్ ప్రకారమే చెరో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందడాన్ని పోలీసులు గమనించారు. ఆమె హత్య కేసులో వీరిద్దరే ప్రధాన నిందితులని పోలీసులు నిర్ధారణకు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే పార్టీకి హాజరయిన వారిని ప్రశ్నిస్తున్నారు.

  ఈ దారుణ ఘటనకు ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కారణమయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఝాన్వీ, శ్రీ ప్రేమించుకుంటున్నారనీ, మధ్యలో దియా కూడా రావడంతోనే గొడవలు స్టార్ట్ అయ్యాయని వారి అనుమానం. పార్టీలో దియా, ఝాన్వీ అత్యంత సన్నిహితంగా ఉండటం చూసి భరించలేక వారిని నిలదీయడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ మొదలు పెట్టారు. తన కుమార్తె హత్య కేసును త్వరగా పరిష్కరించాలనీ, ఈ ఘటనకు కారణమయిన వారిని శిక్షించాలని ఝాన్వీ తల్లి నిధి కోరుతోంది. ’దియా మా పక్కింటి వాళ్ల అమ్మాయి. ఝాన్వీకి చిన్నప్పటి నుంచి స్నేహితురాలు. తనే శ్రీ జోగ్డాన్కర్ అనే యువకుడితో కలిసి డిసెంబర్ 31వ తేదీ రాత్రి మా ఫ్లాట్ కు వచ్చారు. పార్టీకి రమ్మని పిలిచారు. నా కూతురు రానన్నా సరే బతిమిలాడి మరీ పిలుచుకుని పోయారు. 30 నిమిషాల్లో తిరిగి పంపిస్తామన్నారు కానీ తెల్లారేసరికి నా కూతుర్ని శవంగా మార్చారు. పార్టీకి 13 మంది వరకు వచ్చారట. ఒక్కళ్లు కూడా ఈ దారుణాన్ని ఆపలేకపోయారు. సకాలంలో స్పందించి ఎవరైనా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే ఈ రోజు నా కూతురు నాకు దక్కేది. నా కూతురికి శ్రీ అనే యువకుడిని ఏ సంబంధం లేదు.‘ అని ఝాన్వీ తల్లి నిధి చెప్పుకొచ్చారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. విచారణ జరుగుతోందనీ, త్వరలోనే కేసును పరిష్కరిస్తామని పోలీసులు వెల్లడించారు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Love affair, Mumbai attacks, Mumbai crime, Murder

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు