ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) చిత్తూరు జిల్లా (Chittoor District) మదనపల్లి జంట హత్యల (Madanapalli Double Murder Case) కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. తాజాగా హత్యల వెనుక వేరే అనుమానాలున్నాయని ఓ లాయర్ చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. మూఢనమ్మకాల మైకంలో హత్యలు జరిగాయని భావిస్తున్న పోలీసులు ఆదిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఐతే పురుషోత్తంనాయుడు, పద్మజ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఖచ్చితంగా ఏం జరిగి ఉంటుందనేది పోలీసులు అంచనాకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ లాయర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. హత్య జరిగిన తర్వాత కనిపించిన దృశ్యాలు, పురుషోత్తంనాయుడు, పద్మజల ప్రవర్తన చూసిన తర్వాత క్షుద్రపూజలు, మూఢ విశ్వాసాలేనని అందరూ చెప్తుండగా ఇప్పుడు లాయర్ వ్యాఖ్యలు కేసును మరో మలుపు తిప్పాయి. మదనపల్లె సబ్ జైలులో ఉన్న పురుషోత్తంనాయుడుని కలిసిన రజని అనే న్యాయవాది.., హత్యల వెనుక ఏదో మిస్టరీ ఉందని చెప్పారు.
హైదరాబాద్ కు చెందిన లాయర్ కృష్ణమాచార్య తరపున వచ్చిన లాయర్ రజని.. శనివారం మదనపల్లి సబ్ జైలులో ఉన్న పురుషోత్తంనాయుడు, పద్మజలను కలిసి మాట్లాడేందుకు యత్నించారు. ఐతే జైలు అధికారులు నేరుగా కలిసేందుకు అనుమతివ్వలేదు. దీంతో దూరంగా ఉండే ఆమె పురుషోత్తం నాయుడుతో కాసేపు మాట్లాడారు. హత్యలకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. పది నిముషాల తర్వాత సమయం అయిపోయినట్లు అధికారులు చెప్పడంతో వెనుదిరిగారు.
పురుషోత్తంనాయుడుతో మాట్లాడిన తర్వాత జంటహత్యలకు ప్రధాన కారణం క్షుద్రపూజలు కాదని ఆమె అన్నారు. ఇప్పటివరకు తెలిసిన వివరారు, పురుషోత్తంనాయుడు ఇంట్లోని దృశ్యాలను పరిశీలించిన తర్వాత దీని వెనుక మరో కారణం ఉండి ఉండొచ్చన్నారామె. హత్యాస్థలంలో కనిపించిన దృశ్యాలు క్షుద్రపూజలవి కావని ఆమె అన్నారు. అలాగే అంతటి ఘోరానికి పాల్పడానికి కారణం నిందితుల ఆధ్యాత్మిక మైకం కూడా కారణం కాకపోవచ్చని తెలిపారు. కేసులో చెప్తున్న కారణాలకు, నిందితుల ప్రవర్తనకు సంబంధం లేదన్నారు. ఇక్కడ రుద్రుడు (శివుడు) – క్షుద్రుడు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలను కలిపి చూడలేమని.. వీటికి సంబంధమే లేదంటున్నారు. ఈకేసులో మరిన్ని విషయాలు వెలుగు చుడాలన్నారు. నిందితులకు న్యాయసలహా అవసరమని భావించే ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.