పాముకాటుతో మహిళ మృతి కేసులో కొత్త ట్విస్ట్... పోలీసులకే షాక్...

Snake Case : టీవీ ఛానెళ్లు, యూట్యూబ్‌, వెబ్ సిరీస్‌లలో ఎన్నో రకాల కేసుల్ని చూస్తుంటాం. వాటిలో ఎక్కడా ఇలాంటి కేసు రాలేదు. ఈ సరికొత్త ప్లాన్ పోలీసుల్నే ఆశ్చర్యపరిచింది.

news18-telugu
Updated: December 6, 2019, 6:11 AM IST
పాముకాటుతో మహిళ మృతి కేసులో కొత్త ట్విస్ట్... పోలీసులకే షాక్...
పాము (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో అమితేశ్ పటారియా, శివానీ భార్యాభర్తలు. పటారియా ఓ బ్యాంక్ మేనేజర్. ఆదివారం శివానీ చనిపోయింది. కన్నీళ్లు పెడుతున్న భర్తను ఓదార్చిన చుట్టుపక్కల వాళ్లు ఎలా జరిగింది అని అడిగితే... పాము కరిచింది అని చెప్పాడు. ఆమె చేతిలో పాము కాటు వేసినట్లు ఉన్న గుర్తుల్ని వాళ్లకు చూపించాడు. అది చూసి... అవును పాము కాటే అని నలుగురూ... మాట్లాడుకున్నారు. పోలీసులు ఎంటరయ్యారు. చుట్టూ చూశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆ రిపోర్టులో కొత్త విషయం తెలిసింది. ఏంటంటే... పాము ఆమెను బతికి ఉన్నప్పుడు కాటెయ్యలేదు. చనిపోయిన తర్వాత కాటేసిందని తెలిసింది. మరైతే ఆమె ఎలా చనిపోయింది? ఆమెను గొంతు పిసికి, నులిమేయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పింది. పోలీసులకు మనుషులు చెప్పే దానికంటే రిపోర్టుల్లో చెప్పినదానిపైనే ఎక్కువ నమ్మకం ఉంటుంది. సో, మళ్లీ వెళ్లి... "రేయ్ ఇటు రారా" అని పిలిచారు. పోలీసుల స్వరంలో మార్పు వచ్చేసరికి పటారియాకు వణుకు మొదలైంది. "మేము నిన్ను కొట్టడం, ఒళ్లంతా బొబ్బలెక్కడం, ఆ తర్వాత నిజం కక్కడం... ఇదంతా అవసరమా... స్ట్రైట్‌గా అసలు విషయం చెప్పేయ్" అన్నారు. బ్యాంక్ మేనేజర్ కదా... నాటకాలాడి లాభం లేదని అర్థం చేసుకున్నాడు. తనే తన భార్యను చంపేశానన్నాడు.

ఇదీ జరిగింది : రొటీన్‌గా వాళ్లకు పెళ్లైంది. అంతే రొటీన్‌గా గొడవలు పడ్డారు. "బ్యాంకులోనూ టెన్షన్లే... ఇంటికొస్తే కూడా టెన్షన్లే... ఛీ జీవితం"... అనుకున్నాడు. భార్యను లేపేస్తేనే సుఖంగా ఉంటుందనే పిచ్చి ఆలోచనకొచ్చాడు. ఇదే విషయాన్ని తన చెల్లి, తన తండ్రికి చెప్పాడు. వాళ్లకూ ఆమెపై కోపం ఉంది. సో... గో ఎహెడ్ అని పటారియాను ఎంకరేజ్ చేశారు. అంతే... వన్ బ్యాడ్ డే... ఆమెను పీక పిసికి చంపేశాడు. ఇదే విషయం పోలీసులకు చెప్పాడు.

మరి ఆ పాము సంగతేంటి? అని మనలాగే పోలీసులు అడిగారు. మామూలుగా చంపితే తెలిసిపోతుందని... ఓ ప్లాన్ వేశాడు. పది రోజుల కిందట రాజస్థాన్ వెళ్లి... ఓ నల్లతాచుపామును తెచ్చాడు. రూ.5000 పెట్టి కొన్నాడు. దానితో ఎలా కాటువేయించాలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతా నేర్చుకున్నాక, కాన్ఫిడెన్స్ వచ్చాక... భార్యను రాత్రివేళ చంపేశాడు. ప్లాన్ ప్రకాశం శవానికి పాముతో కాటు వేయించి... ఆ తర్వాత పామును చీకట్లోనే ఇంటికి కొద్ది దూరంలో వదిలేశాడు. తెల్లారే ఏడుపు మొదలుపెట్టాడు.

పోస్ట్‌మార్టం రిపోర్టులో చెప్పిందే నిజమని తేలడంతో... పటారియా, అతని చెల్లి, తండ్రిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. హత్య కేసుతోపాటూ... వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కూడా కేసు నమోదుచేశారు.


తెలుగందం ఈషా రెబ్బా ఫొటోస్
ఇవి కూడా చదవండి :సోషల్ మీడియాపై స్కాన్... వివాదాస్పద పోస్టులు పెడితే... దబిడ దిబిడే...

Health : జామ ఆకులతో 8 ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips : రోజూ ఇవి తినండి... బరువు తగ్గడం గ్యారెంటీ

యాపిల్ గురించి మీకు తెలియని ఆశ్చర్యకర విషయాలు... చకచకా...

మీ మొబైల్ లో యాప్స్‌ డైరెక్టుగా ఎవరికైనా పంపాలా... సింపుల్... ఇలా చెయ్యండి
Published by: Krishna Kumar N
First published: December 6, 2019, 6:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading