హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: రాజమండ్రి సుబ్రహ్మణ్యస్వామి విగ్రహధ్వంసం కేసులో ఊహించని ట్విస్ట్.. ఆ ఇద్దరే డబ్బులిచ్చి మరీ పూజారితోనే..

Andhra Pradesh: రాజమండ్రి సుబ్రహ్మణ్యస్వామి విగ్రహధ్వంసం కేసులో ఊహించని ట్విస్ట్.. ఆ ఇద్దరే డబ్బులిచ్చి మరీ పూజారితోనే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాజమండ్రి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహద్వంసం కేసులో అసలు నిందితుడెవరన్నది పోలీసులు తేల్చేశారు. స్వామివారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎవరో నాశనం చేశారంటూ ఫిర్యాదు చేసిన ఆలయ పూజారే అసలు దోషి అని పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా దాడులు జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. హిందూ దేవాలయాల్లోనే దాడులు జరుగుతుండటంతో చెడ్డపేరు వస్తోందని గ్రహించిన ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఈ కేసుల్లో విచారణను వేగవతం చేయాలనీ, అసలు నిందితులెవరన్నది తేల్చాలని పోలీసు శాఖకు జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రధాన ఆలయాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో కేసును పరిష్కరిస్తూ వస్తున్నారు. తాజాగా రాజమండ్రి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహద్వంసం కేసులో అసలు నిందితుడెవరన్నది పోలీసులు తేల్చేశారు. స్వామివారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎవరో నాశనం చేశారంటూ ఫిర్యాదు చేసిన ఆలయ పూజారే అసలు దోషి అని పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే..

  రాజమండ్రిలోని శ్రీరామనగర్ లో ఉన్న సంకటహరవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం రెండు చేతులు ధ్వంసమయ్యాయి. గతేడాది డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ విషయమై ఆలయ పూజారి మరల వెంకట మురళీ కృష్ణ, రాజమండ్రి సిటీ పోలీస్ స్టేషన్ లో జనవరి ఒకటిన ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేసిన పోలీసులు అసలు నిందితుడు ఎవరన్నది తేల్చేశారు. ఈ ఘటనకు ఆలయ పూజారి వెంకట మురళీ కృష్ణే పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.

  ఆలయ పూజారి వెంకట మురళీ కృష్ణకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఆసరగా తీసుకుని కొందరు వ్యక్తులు అతడికి డబ్బు ఇచ్చి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని ద్వంసం చేయాల్సిందిగా సూచించారు. ఆర్థిక పరిస్థితులు రీత్యా దానికి వెంకట మురళీ కృష్ణ ఒప్పుకున్నాడు. గతేడాది డిసెంబర్ 31న సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చేతులను ధ్వంసంచేసి మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎనిమిది బృందాలతో పోలీసులు విచారణ చేసి పూజారినే అసలు దోషిగా తేల్చేశారు. పూజారి చెప్పిన విషయాలను బట్టి మల్ల వెంకటరాజు (42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ భర్త), తంతులూరి వెంకటపతి రాజు (మాజీ టీఎన్టీయూసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ) ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి అరెస్ట్ విషయమై రాజమండ్రి సిటీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Andhra Pradesh, Ap local body elections, AP Temple Vandalism, Nimmagadda Ramesh Kumar, TDP, Ycp

  ఉత్తమ కథలు