దిశ కేసులో కీలక మలుపు... నిందితుల్లో ఇద్దరు మైనర్లు ?

ఎన్ కౌంటర్ జరిగిన రోజు నాటికి జొల్లు శివ వయసు 17 ఏళ్ల 3నెలల 21 రోజులు. చెన్నకేశవుల వయసు 15ఏళ్ల 7నెలల 26 రోజులుగా ఉంది.

news18-telugu
Updated: December 10, 2019, 10:01 AM IST
దిశ కేసులో కీలక మలుపు... నిందితుల్లో ఇద్దరు మైనర్లు ?
దిశ కేసు నిందితులు
  • Share this:
దిశ హత్యాచార కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసును దర్యాప్తు చేస్తున్న NHRC చేతికి కీలక ఆధారాలు లభించాయి. దిశను అత్యాచారం చేసి అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి హత్య చేశారు నలుగురు యువకులు. దీంతో ఆ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం దిశను హతమార్చిన చటాన్‌పల్లిలోనే వారిని కూడా ఎన్‌కౌంటర్ చేశారు. సీన్  రికన్స్ట్రక్షన్ కోసం నిందిుతలతో పటు చటాన్‌పల్లి వెళ్లిన నలుగురు నిందితులు తమపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా ఎన్‌కౌంటర్ చేయక తప్పలేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్  వివరణ కూడా ఇచ్చారు.

పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని కొత్త అంశం తెరమీదకు వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ప్రధాన నిందితుడైన మహమ్మద్ ఆరిఫ్ కి 26ఏళ్ళు ఉండగా... మిగతా నిందితులు శివ, నవీన్, చెన్నకేశవులుకు 20 ఏళ్ళు ఉంటాయని సీపీ సజ్జనార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నిందితుల తల్లిదండ్రులను విచారించగా సరికొత్త విషయం తెరమీదికి వచ్చింది. దిశా కేసులోని నలుగురు నిందితులు ఇద్దరు నిందితుల తల్లిదండ్రులు తమ కొడుకులు మైనర్లని కూడా చూడకుండా ఎన్‌కౌంటర్  చేశారు అంటూ జాతీయ మానవ హక్కుల కమీషన్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం.

దీంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు మృతుల ఆధార్ కార్డు, సర్టిఫికెట్ వివరాలను పరిశీలించగా... తేదీలు వేరువేరుగా ఉండడంతో కేసు మరో కొత్త మలుపు తిరిగింది అని సమాచారం.నిందితుల్లో చింతకుంట చెన్నకేశవులు,జొల్లు శివ మైనర్లన్న విషయం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డలు మైనర్లని వారి కుటుంబ సభ్యులు NHRCకి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు వారి వయసు ధృవీకరణకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికెట్లను కూడా సమర్పించినట్లు తెలుస్తోది. శివ, చెన్నకేశవులకు 18ఏళ్లలోపే వయసు ఉన్నట్లు వారి బోనఫైడ్ సర్టిఫికెట్లు స్పష్టం చేస్తున్నాయి. జొల్లు శివ చింతకుంట చెన్నకేశవులు నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం గుడిగుండ్లలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఆ పాఠశాలలోని జారీ చేసిన బోనఫైడ్ సర్టిఫికేట్ల ప్రకారం ఎన్ కౌంటర్ జరిగిన రోజు నాటికి జొల్లు శివ వయసు 17 ఏళ్ల 3నెలల 21 రోజులు. చెన్నకేశవుల వయసు 15ఏళ్ల 7నెలల 26 రోజులుగా ఉంది. వీరిలో చెన్నకేశవులు 2014 జూలై నుంచి 2015 ఏప్పిల్ వరకు ఆరో తరగతి చదివాడని బోనఫైడ్ సర్టిపికఎట్లో పేర్కొన్నారు. అతడి పుట్టిన తేదీని 10.04.2004గా పేర్కొన్నారు. చెన్నకేశవులు కిడ్నీ సంబధిత వ్యాదితో బాధపడుతున్నట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దాని చికిత్స నిమిత్త 2018 సెప్టెంబర్ 18నే బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. చెన్నకేశవులకు ఇప్పటికే పెళ్లైంది.అతడి భార్య ప్రస్తుతం గర్భవతి.
Published by: Sulthana Begum Shaik
First published: December 10, 2019, 10:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading