కారు డోర్ లాక్.. ముగ్గురు పిల్లల మృతి కేసులో ట్విస్ట్..

పిల్లలు కారులో నుంచి బయటపడేందుకు రేర్ వ్యూ మిర్రర్‌ను పగలగొట్టారు. దాంతో ముందు అద్దాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించారు.

news18-telugu
Updated: August 7, 2020, 2:25 PM IST
కారు డోర్ లాక్.. ముగ్గురు పిల్లల మృతి కేసులో ట్విస్ట్..
కారును పరిశీలిస్తున్న పోలీసులు
  • Share this:
కృష్ణా జిల్లా బాపులపాడులో కారు డోర్ లాక్ కావడంతో ముగ్గురు పిల్లలు ఊపిరాడక చనిపోయిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు మూడు గంటల పాటు ఆ చిన్నారులు నరకయాతన అనుభవించారు. గాలి ఆడక ముగ్గురు పిల్లలు విగతజీవులుగా మారారు. ముగ్గురు చిన్నారులు పర్వీన్, యాస్మిన్, హసీనా ముగ్గురి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. బాపులపాడులోని ఓ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తన కారును పార్క్ చేసి వెళ్లాడు. అయితే, ఒక డోర్ లాక్ కాలేదు. దీంతో పిల్లలు ముగ్గురు ఆడుకోవడానికి అందులోకి ఎక్కారు. పర్వీన్, యాస్మిన్, హసీనా ముగ్గురూ కారు ఎక్కారు. కొద్దిసేపు కూర్చున్న తర్వాత కారు డోర్స్ లాక్ అయిపోయాయి. దీంతో వారికి ఊపిరి ఆడలేదు. ఈ క్రమంలో వారు బయటపడేందుకు రేర్ వ్యూ మిర్రర్‌ను పగలగొట్టారు. దాంతో ముందు అద్దాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం సఫలం కాలేదు. కారులో ఉండే పెర్ ఫ్యూమ్ బాటిల్‌ను కూడా విరగ్గొట్టారు. దాంతో ముందు అద్దం పగలగొట్టడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా వారి ప్రయత్నం ఫలించలేదు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత పిల్లలు కారులోకి ఎక్కారు. సుమారు 4.30 గంటల సమయంలో వారిని కారులో చూసేసరికి శరీరం మీద బొబ్బలతో చనిపోయి కనిపించారు. వారి చెప్పులు, మాస్కులు, ఒంటి మీద బట్టలు కూడా కారులోనే ఉన్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 7, 2020, 2:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading