Home /News /crime /

NEW SCAM IN THE NAME OF ADIDAS WOMENS DAY GIFT VIRAL MESSAGE CIRCULATING FULL DETAILS HERE HSN

World Womens Day: ఇలాంటి లింక్ కనుక మీ ఫోన్ కు వస్తే అస్సలు క్లిక్ చేయొద్దు.. వాట్సప్ యూజర్లకు అలెర్ట్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహిళా దినోత్సవం సందర్భంగా అడిడాస్ కంపెనీ ప్రత్యేక బహుమతిని అందిస్తోంది. పది లక్షల మందికి ఈ అద్భుత అవకాశం లభించబోతోంది. వారిలో మీరు కూడా ఒకరు కావచ్చు.. అంటూ ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది..

    టెక్నాలజీ రాకతో మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతుల్లో సైబర్ చోరులు మోసాలకు పాల్పడుతున్నారు. మధ్య తరగతి వర్గాల్లో సాధారణంగా ఉండే డబ్బు ఆశనే సైబర్ చోరులు అస్త్రంగా వాడుకుంటున్నారు. ఫోన్లు చేసి ఆఫర్లు ఉన్నాయంటూ వల వేస్తున్నారు. వారి వలలో పడిన వారి నుంచి లక్షలకు లక్షలను లాగేస్తున్నారు. ఇందుకోసం పండుగలు పబ్బాలే కాకుండా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే రోజులను కూడా వాడుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ మోసం గురించే పోలీసులు, వాట్సప్ యాజమాన్యం హెచ్చరిస్తున్నారు. వాట్సప్ వేదికగా జరుగుతున్న ఈ నయా మోసం గురించి నెటిజన్లను అలెర్ట్ చేస్తున్నారు. మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లంటూ వల విసురుతూ భారీ మోసానికి పాల్పడుతున్నారు. దీని గురించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ‘మహిళా దినోత్సవం సందర్భంగా అడిడాస్ కంపెనీ ప్రత్యేక బహుమతిని అందిస్తోంది. పది లక్షల మందికి ఈ అద్భుత అవకాశం లభించబోతోంది. వారిలో మీరు కూడా ఒకరు కావచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పది లక్షల మందికి అత్యంత ఖరీదైన పాదరక్షలు, షూ, చెప్పల్స్ వంటివి ఉచితంగా ఇస్తోంది. త్వరపడండి. ఈ లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలను పూర్తి చేయండి‘ అంటూ ఓ లింక్ తో కూడిన మెసేజ్ ఒకటి వాట్సప్ లో ఇటీవల విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఇది పూర్తిగా సైబర్ చోరులు చేస్తున్న నయామోసానికి సంబంధించిన కొత్త ఎత్తుగడ అని పోలీసులు తేల్చేశారు.
    ఇది కూడా చదవండి: ప్లీజ్.. నన్ను రెండో పెళ్లయినా చేసుకోమని కోరిన యువతి.. నో చెప్పిన ప్రియుడు.. ఆ భగ్న ప్రేమికురాలు ఎంతకు తెగించిందంటే..

    వాస్తవానికి అడిడాస్ కంపెనీ పేరులో ఇంగ్లీషు స్పెల్లింగ్ ‘Adidas’ అని ఉంటుంది. కానీ ఆ లింక్ పై క్లిక్ చేస్తే మాత్రం ’కంగ్రాచ్యులేషన్‘ అని కనిపించి అడిడాస్ కంపెనీ స్పెల్లింగ్ కాస్తా ‘Adidass’ అని కనిపిస్తుంటుంది. అడిడాస్ కంపెనీ లోగోను పోలి ఉండేలా ఆ లింక్ సైటును తయారుచేసి, అక్షరాలను కూడా చూసిన వెంటనే గుర్తుపట్టలేకుండా ఉండేలా చేసి సైబర్ చోరులు మోసానికి తెరలేపారు. ఈ లింక్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే కనుక మోసపోవడం ఖాయమనీ, ఈ తరహా లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాట్సప్ కూడా తమ యూజర్లకు ప్రత్యేకంగా ఓ హెచ్చరికను జారీ చేసింది.
    ఇది కూడా చదవండి: భర్తతో తెగదెంపులు.. పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్న 25 ఏళ్ల యువతికి ఓ వ్యక్తి పెళ్లి ప్రపోజల్.. చివరకు..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, VIRAL NEWS, Whatsapp, Womens day 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు