ఏపీలో దారుణం... యువకుడి వేధింపులు నవవధువు ఆత్మహత్య

ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. యువతి అత్తగారింటికి వెళ్లి మరి గొడవ చేశాడు.

news18-telugu
Updated: December 23, 2019, 8:19 AM IST
ఏపీలో దారుణం... యువకుడి వేధింపులు నవవధువు ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పఠాన్ రాయాజ్ ఖాన్ కూతురు ఫామీదను... అదే కాలనీకి చెందిన బావాజాన్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. రెండు నెలలపాటు వీరి కాపురం అన్యోన్యంగా సాగింది. ఇంతలో సైదాపేటకు చెందిన ఓ యువకుడు ఫామిదా కుటుంబంలో గొడవలు రేపాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. యువతి అత్తగారింటికి వెళ్లి మరి గొడవ చేశాడు. దీంతో ఇంట్లో పెద్దల ముందు తన పరువు పోయిందని పాపం ఫామిదా మనస్తాపానికి గురైంది.

దీంతో ఆందోళన చెందిన ఆమె ఇంటి పైకప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫామీద మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల రోదనలతో ఆస్పత్రిలో విషాదకర పరిస్థితి నెలకొంది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Published by: Sulthana Begum Shaik
First published: December 23, 2019, 8:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading