• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • NEW KIND OF E WALLET SCAM FOR MONEY WITH MOBILE NK

ఈ వ్యాలెట్ పేరుతో నయా మోసం... లబోదిబోమంటున్న ప్రజలు

ఈ వ్యాలెట్ పేరుతో నయా మోసం... లబోదిబోమంటున్న ప్రజలు

ప్రతీకాత్మక చిత్రం

Cyber Crime : సైబర్ నేరగాళ్ల పని ఎప్పుడూ ఒకటే. డబ్బు లాగేయడం. టార్గెట్ కూడా ఒక్కటే సామాన్య ప్రజలే. టెక్నాలజీని ఉపయోగించుకొని చక్కగా కాజేస్తున్నారు. అలాంటి ఓ కొత్త మోసం వివరాలు తెలుసుకుందాం. తద్వారా అందులో చిక్కుకోకుండా తప్పించుకోవచ్చు.

 • Share this:
  Cyber Crime in Hyderabad : మీరు గూగుల్ పే, పేటీఎం వంటి ఈ-వ్యాలెట్లు వాడుతున్నారా? ఐతే... మీకు సైబర్ నేరగాళ్ల నుంచీ వచ్చే ప్రత్యేక మెసేజ్‌లు బాగా నచ్చే ఛాన్సుంది. ఆ మెసే‌జ్‌లలో ఏముంటుందంటే... మీరు గూగుల్ పే వాడుతున్నట్లైతే... దాని ద్వారా మీరు కింది మొబైల్ నంబర్‌ అకౌంట్‌కు డబ్బు పంపితే... మీకు డబుల్ మనీ రిటర్న్ వస్తుంది. ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్లు పెంచేందుకు, అలవాటు చేసేందుకు గూగుల్ తెచ్చిన కొత్త ఆఫర్ ఇది అని మెసేజ్ పంపిస్తున్నారు. అలాగే... పేటీఎం వాడుతున్నట్లైతే... మీరు పేటీఎం ద్వారా డబ్బు చెల్లిస్తే... మీకు డబుల్ అమౌంట్ రిటర్న్ వస్తుంది. కావాలంటే ఓ రూ.5 కింది నంబర్‌ అకౌంట్‌కు పే చెయ్యండి. మీరు రూ.10 చెల్లిస్తే... మీకు రూ.20 వస్తాయి. అదే రూ.1000 చెల్లిస్తే... రూ.2000 వస్తాయి. ఒక రోజుకు మాగ్జిమం రూ.30,000 వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది అని మెసేజ్‌లో చెబుతున్నారు. ఇలాంటివి చదివాక మనం ఏం చేస్తాం... ఓ ట్రయల్ వేద్దామని ఓ రూ.5ల్ని సదరు అకౌంట్‌కి పంపుతాం. కొన్ని క్షణాలకే మనకు రిటర్న్ డబ్బు రూ.10 వస్తుంది. అయ్ ఇదేదో బాగుందే అని ఈసారి రూ.10 పంపుతాం. వెంటనే రూ.20 వెనక్కి వస్తుంది. అది చూసి తెగ ఆనందపడతాం. ఈసారి 1000 పంపుతాం. వెంటనే రూ.2000 వెనక్కి వస్తుంది. అప్పుడేం చేస్తాం... ఇదేదో బాగుందే అనుకుంటూ ఈసారి ఏకంగా 20000 పంపుతాం. అప్పుడు రూపాయి కూడా వెనక్కి రాదు. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా డబ్బు రాదు. అప్పుడర్థమవుతుంది మనం మోసపోయామని.

  ఇలా డబుల్ మనీ ఇస్తామని ఏవైనా మెసేజ్‌లు వస్తే... వాటిని పూర్తిగా చదవక ముందే డిలీట్ చేసేయండి. అవి నకిలీ మెసేజ్‌లు. మనం తెలివైన వాళ్లం కాబట్టి... మనం ఎట్టి పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకూడదు. వాళ్లకు చెక్ పెట్టాలి. ఆల్రెడీ ఇలాంటి ఉచ్చులో పడిన వాళ్లు సైబర్ పోలీసుల్ని కలిసి... తమకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్నారు. ఇలాంటి కేసుల్లో నేరస్థుల్ని పోలీసులు పట్టుకోవడం కష్టం ఎందుకంటే వాళ్లు ఇండియాలో లేకపోవచ్చు. ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్ ద్వారా డబ్బు కాజేస్తూ ఉండొచ్చు. జనరల్‌గా హ్యాకర్లే ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. కాబట్టి... వీళ్ల ఉచ్చులో చిక్కి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగడం కంటే... ముందే జాగ్రత్త పడితే మేలు.

  ఓ బాధితురాలు చెప్పిన ప్రకారం... ఆమె 20వేలు సదరు అకౌంట్‌కు పంపిందట. వెంటనే మెసేజ్ వచ్చింది ఏమనీ... మీకు రూ.40వేలు వచ్చాయి చూసుకోమని. ఆమె చూసుకుంటే రూపాయి కూడా రాలేదు. తనకు డబ్బు రాలేదని మెసేజ్ పెట్టింది. సారీ... టెక్నికల్ ఫాల్ట్ వల్ల ఇలా జరిగింది. మీ మనీ కట్ అవ్వదు. మీరు పంపిన అమౌంట్ మాకు రాలేదు. మళ్లీ రూ.20 వేలు పంపండి. అని చెప్పారు. ఆమె మళ్లీ రూ.20వేలు పంపింది. ఈసారి ఏ మెసేజూ రాలేదు. అలా ఆమె మొత్తం రూ.40 వేలు నష్టపోయింది. ప్రస్తుతం ఆమెకు మెసేజెస్ పంపిన మొబైల్ పనిచెయ్యట్లేదు. ఇలా సైబర్ నేరగాళ్లు ఆమెను రూ.40వేలకు మోసం చేశారు. అందువల్ల అప్రమత్తంగా ఉంటే... మన మనీ సేఫ్‌గా ఉంటుంది.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు