హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: ఫేస్‌బుక్ లో పరిచయం.. ఆపై న్యూడ్ వీడియోకాల్స్  రికార్డ్ చేసి..

Shocking: ఫేస్‌బుక్ లో పరిచయం.. ఆపై న్యూడ్ వీడియోకాల్స్  రికార్డ్ చేసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: సోషల్ మీడియాలో ఒక యువకుడు, అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టాడు. దీంతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. తరచుగా మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో చనువు పెరిగింది.

కొందరు యువత టెక్నాలజీని (Social media)  తప్పుడు పనులకు వినియోగిస్తున్నారు. ఫోన్ లలో అశ్లీల వీడియోలు చూస్తు, ఫేస్ బుక్, ఇన్ స్టాలో అమ్మాయిలను పరిచయం చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తు, వేధిస్తున్నారు. ఈ మధ్య కాలంలో.. ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో దారుణాలు, మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, సైబ‌ర్ నిపుణులు తెలియని వారి రిక్వెస్ట్ లను యాక్సె ప్ట్ చేయోద్దని ఎంత చెప్పిన, నేటి యువత పట్టించుకోవడం లేదు. మెయిగా, అమ్మాయిలు, మహిళలు ఫేస్ బుక్ ట్రాప్ లో పడుతున్నారు. తెలియని వారితో చాట్ చేస్తు.. ఆ తర్వాత మోసాలకు గురౌతున్నారు. కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి.. స్నేహం పేరిట మాయ‌ మాట‌లు చెప్పి.. వారి త‌మ బుట్ట‌లో వేసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ఢిల్లీలో జరిగింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో  (Delhi) ఒక యువతికి ఫేస్ బుక్ లో అఫ్సర్‌ఖాన్(20) యువ‌కుడు పరిచయం అయ్యాడు. కొన్నిరోజుల పాటు వీరు చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య చనువు పెరిగింది. నెంబర్ లను కూడా ఇచ్చుకున్నారు. వీడియో కాల్స్ మాట్లాడుకునే వారు. అమ్మాయి పూర్తిగా నమ్మించాడు. కొన్ని సార్లు.. న్యూడ్ గా (nude video calls) మాట్లాడాల్సిందిగా కోరాడు. చాలా సార్లు అమ్మాయి అవాయిడ్ చేసింది. కానీ ఒక సారి మాత్రం బలవంతం చేయడంతో మాట్లాడింది.

అతగాడి మనసులో ఉన్న దుర్మార్గాన్ని పసిగట్టలేక పోయింది. అప్పటి నుంచి అతని అసలు రంగు బయట పడింది. ఆమెను వేరే నెంబర్ ల నుంచి ఫోన్ చేసి నగ్న వీడియోలు పంపాడు. 20 వేలు ఇవ్వాలని లేకపోతే, వీడియోలు బంధువులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించాడు.దీంతో ఆమె పది వేలు ఇచ్చింది. వేధింపులు మరీ ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఇతను ఇప్పటి వరకు ముగ్గురు యువతులను వేధించినట్లు తెలిసింది. నిందితుడు రాజస్థాన్‌లోని అల్వార్ గ్రామానికి చెందిన వాడని విచారణలో తెలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా వెస్ట్ బెంగాల్ లో (West bengal) అమానుష ఘటన జరిగింది.

కోల్ కతాలోని మైదాన్ మెట్రోరైలులో ఈ ఉదంతం శనివారం జరిగింది. ఒక యువతి.. పార్క్ స్ట్రీట్ ఏరియాలో మెట్రో (Metro train)  ఎక్కింది. రైలు అంతా రద్దీగా ఉంది. అయితే, ఒక ముసలాయన యువతికి, సీటు ఇస్తానని పిలిచాడు. ఆ తర్వాత.. ఆమెతో మాటలు కలిపాడు. తాను రిటైర్డు ఉద్యోగి అని చెప్పుకున్నాడు. కాసేపటికి వెకిలిగా ప్రవర్తించసాగాడు.

అమ్మాయిని, అసభ్యంగా తాకుతూ.. పైశాచికానందం పొందాడు. దీంతో యువతి భయంతో అక్కడి నుంచి లేచింది. అతను ఆమెను ఫాలో అయ్యాడు. హోటల్ కు రావాల్సిందిగా అభ్యర్థించాడు. దీంతో యువతి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. స్థానికులు ఆ ప్రాంతంలో గుమిగూడారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Delhi, Female harassment

ఉత్తమ కథలు