హోమ్ /వార్తలు /క్రైమ్ /

Affiar: ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్... కట్టుకున్న భర్తకు మాయమాటలు చెప్పి..

Affiar: ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్... కట్టుకున్న భర్తకు మాయమాటలు చెప్పి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: భర్త తనను తరచుగా కొడుతున్నాడని మహిళ ఆవేషంతో రగిలిపోయింది. ఈ క్రమంలో తన ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది.

ప్రస్తుతం సమాజంలో కొందరు వివాహ బంధానికున్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. కొందరు లవ్ ఎఫైర్ లు కొనసాగిస్తున్నారు. టీనేజ్ రాగానే లవర్ ను మెయింటెనెన్స్ చేయడం స్టెటస్ సింబల్ గా భావిస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరోకరితో ప్రేమాయణాలు (Love affairs)  నడిపిస్తున్నారు. కొందరు మరీ నీచంగా.. పెళ్లైన తర్వాత కూడా దిగజారీ వివాహేతర సంబంధాలు (Extra marital affairs)  పెట్టుకుంటున్నారు. దీంతో తమ బతుకులను బజారుకు ఈడ్చుకుంటున్నారు. తమతో పాటు, తమ ఇంట్లో వారి పరువును తీస్తున్నారు. సమాజం ముందు చులకనగా మారుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. న్యూఢిల్లీ లో (Delhi) సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కల్కాజీ ప్రాంతంలో మే 14 జరిగింది. కల్కాజీలో ఒక అపార్ట్ మెంట్ లో దంపతులు ఉండేవాడు. ఈ క్రమంలో వీరిద్దరికి మధ్య తరచుగా గొడవలు జరుగుతు ఉండేవి. దీంతో స్వర్ణాలి ఘోష్ తన భర్త మీద పీకలదాక కోపం పెంచుకుంది. అప్పటికే స్వర్ణాలి ఘోష్.. భర్తకు తెలియకుండా మోహన్ పాల్ తో రెండెళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.

ఈ క్రమంలో తన ప్రియుడికి (Lover) భర్త వేధింపులను చెప్పింది. దీంతో ఇద్దరు కలిసి అతడిని హతమార్చాలని ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా ఇంట్లో ఉన్న వ్యక్తిపై, భార్య, స్వర్ణాలి ఘాష్, మోహన్ పాల్ కత్తితో దాడిచేశారు. ఆమె కదలకుండా గట్టిగా పట్టుకుంటే ప్రియుడు, వివాహిత భర్తను హత్య చేశాడు. ఆ తర్వాత.. మోహన్ పాల్ వెస్ట్ బెంగాల్ పారిపోయాడు. అయితే, ఇతని శవాన్ని ఇంటి ముందర పడేశారు. ఎవరో గుర్తు తెలియని దుండుగులు చంపేశారని చెప్పడానికి ప్లాన్ వేశారు.

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోనికి దిగారు. మహిళ చెబుతున్న మాటలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. ఆమె కాల్ డాటాను చూశారు. తమదైన రీతిలో విచారించగా తానే.. నేరాన్ని చేసినట్లు అంగీకరించింది. ఆ తర్వాత పోలీసులు, వివాహిత ప్రియుడు మోహన్ లాల్ ను వెస్ట్ బెంగాల్ లో అరెస్టు చేశారు. వీరిద్దరు గతంలో ఒకే ఆఫీస్ లో సర్వీస్ ప్రొవైడర్ లుగా పనిచేసేవారని ఈ క్రమంలో వీరి మధ్య వివాహేతర సంబంధానికి (affair) దారితీసినట్లుగా తెలుస్తోంది. కాగా, నిందితుడి ఇంటిలో నుంచి రక్తపు మరకలు ఉన్న బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Delhi, Extra marital affair, Illegal affair, Love affair

ఉత్తమ కథలు