Case on jc: మీసం తిప్పారని కొత్త కేసు.. జేసీ దివాకర్ రెడ్డిని వెంటాడుతున్న కేసులు

మీసం మెలేశారని జేసీ పై కేసు

కేసులకు కేరాఫ్ అవుతున్నారు జేసీ దివాకర్ రెడ్డి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనపై నమోదైన కేసులు ఇంకే నేతపైనా నమోదు కాలేదు అంటే ఆశ్చర్యం లేదు. ఒక కేసు నుంచి బెయిల్ దొరికితే మరో కేసు నమోదవుతోంది. తాజాగా మీసం మెలేసి రెచ్చగొట్టారు అంటూ కేసు నమోదు అయ్యింది.

 • Share this:
  ఏపీలో వైసీపీ వర్సెస్ జేసీ బ్రదర్స్ అన్నట్టుగా పరిస్థితి మారింది. ఏపీ వ్యాప్తంగా వైసీపీకి అడ్డు పడుతున్న పార్టీ కానీ.. నేతలు కాని లేరనే చెప్పాలి.. ముఖ్యంగా ఎన్నిక ఏదైనా.. ప్రత్యక్ష ఎన్నికైనా..పరోక్ష ఎన్నికైనా.. వైసీపీ దే గెలుపు.. ఇక రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ప్రతిపక్ష నేతలు రోడ్డుపైకి రావాలి అంటేనే భయపడేలా చేస్త్తున్నారు స్థానిక వైసీపీ నేతలు. అధికార పార్టీతో ఎందుకు పెట్టుకోవడం అని చాలా మంది నేతలు సైలెంట్ అయితే.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు మాత్రం అప్పుడప్పుడు అధిష్టానం పిలుపు మేరకు చిన్న చిన్నా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. తరువాత అక్రమ అరెస్టులు అంటూ హల్ చల్ చేస్తున్నారు.. కానీ వైసీపీ నేతల వ్యూహాలకు మాత్రం ఎదురొడ్డి నిలలేకపోతున్నారు. ఈ విషయంలో జేసీ బ్రదర్స్ అధికార పార్టీకి మింగుడుపడని వ్యహారంగా మారారు. మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా వైసీపీ జెండా ఎగిరినా.. తాడిపాత్రలో మాత్రమే టీడీపీ గెలుపొందింది. అది కూడా కేవలం జేసీ బ్రాండ్ పైనే.. అది పోతే పోయింది. రెండో డిప్యూటీ చైర్మన్ పదవినైనా దక్కించుకోవాలని వైసీపీ భావించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఎక్స్ అఫిషియో సభ్యులతో పదవి చేపట్టొచ్చని.. ఒకరిద్గరు టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యేట్టు చూస్తే గెలుపు సులువే అని వ్యూహాలు రచించారు అంటూ టీడీపీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఆ వ్యూహాన్నిముందుగానే పసిగట్టిన జేసీ దివాకర్ రెడ్డి అలర్ట్ అయ్యారు. చివరికి ఆయన కౌన్సిల్ హాల్ కు వెళ్లకుండానే టీడీపీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించేలా చేశారు..

  దీంతో జేసీ బ్రదర్స్ ను ఎలా ఢీ కొట్టాలా అని వైసీపీ నేతలు మధనపడుతూనే ఉన్నారు. మరోవైపు కేసులు మాత్రం జేసీ దివాకర్ రెడ్డిని వీడడం లేదు. ఒక కేసుపై జైలుకు వెళ్లి.. బెయిల్ పై వస్తే.. మరో కేసు వేస్తున్నారు అధికార పార్టీ నేతలు. తాజాగా జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌ ఎన్నికల సందర్భంగా మీసం మెలేసీ మరి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

  శుక్రవారం అనంతపురం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌-2తో పాటు జిల్లాలోని పది మునిసిపాలిటీల్లో రెండో వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి మినహా అన్ని చోట్ల అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో స్వతంత్ర అభ్యర్థి అంటే టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఈ సందర్భంగా జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సమావేశానికి రాకపోయినా టీడీపీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించానని.. వైసీపీ నేతల వ్యూహాలు ఏమయ్యాయి అన్నారు. తమకు కౌన్సిలర్ కావాలని వైసీపీ నేతలు నేరుగా అడిగితే తానే పంపించే వాడిని అంటూ సెటైర్లు వేశారు. ఓటమి భయంతోనే ఎన్నిక ప్రక్రియను వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు బహిష్కరించారని ఆరోపించారు.
  Published by:Nagesh Paina
  First published: