ఓ అత్త మీద అల్లుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను రేప్ చేయబోయాడు. ఆమె తిరగడడంతో ఏకంగా ఆమె ప్రాణాలే తీశాడు. జార్ఖండ్‌లోని లాతేహర్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని సాదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ససంగ్ గ్రామానికి చెందిన కాలా భుయాన్ అత్తతో లైంగిక సంబంధం పెట్టుకోవాలనుకున్నాడు. అత్త, అల్లుడు ఇద్దరూ ఇరుగు పొరుగు ఇళ్లలోనే ఉంటారు. మంగళవారం ఉదయం అత్త ఇంట్లోకి వెళ్లి అల్లుడు ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి అఘాయిత్యానికి ఒడిగట్టబోయాడు. అయితే, ఆమె తిరగబడింది. తన కామ వాంఛ తీర్చనందుకు ఆ దుర్మార్గుడు ఏకంగా ఆమెను చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్టు మళ్లీ ఇంటికి వచ్చేశాడు. ఇంట్లో శవంగా పడి ఉన్న మహిళను చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్‌ను పిలిపించి విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.