Home /News /crime /

NEPALI CLIMBER NGIMI TENJI SHERPA DIES ON MOUNT EVEREST WAS FOUND IN A SITTING POSITION PVN

Mount Everest : ఎవరెస్ట్ శిఖరంపై ప్రముఖ పర్వతాధిరోహకుడు మృతి..కూర్చున్న స్థితిలోనే

ఎవరెస్ట్ పర్వతం

ఎవరెస్ట్ పర్వతం

Nepali Climber Dies : ప్రపంచంలోని ఎనిమిది ఎత్తైన శిఖరాలకు నిలయం నేపాల్. ఉష్ణోగ్రతలు వెచ్చగా మరియు గాలులు సాధారణంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వసంత కాలంలో వందలాది మంది సాహసికులు వీటిని అధిరోహించేందుకు ప్రయత్నిస్తుంటారు.

Nepali Cimber Dies On Mount Everest : ఎవరెస్ట్ శిఖరాన్ని అనేకసార్లు అధిరోహించిన నేపాలీ పర్వతాధిరోహకుడు ఆ శిఖరంపైనే మరణించినట్లు యాత్ర నిర్వాహకులు శుక్రవారం తెలిపారు, ఈ క్లైంబింగ్ సీజన్‌ లో ప్రపంచంలోని ఎత్తైన పర్వతంపై జరిగిన మొదటి మరణ ఇదే. మృతుడిని 38 ఏండ్ల నెగ్మి టెన్జీ షెర్పాగా గుర్తించారు. ఎవరెస్ట్‌ శిఖరం సమీపంలోని ఖంబు మంచుపాతం వద్ద ఫుట్‌బాల్‌ మైదానంగా పిలిచే సురక్షిత ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఆయన మృతదేహాన్ని గుర్తించారు. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఎత్తుకు చేరినప్పుడు సాధారణంగా వచ్చే అనారోగ్యం కారణాలతోనే నెగ్మి టెన్జీ చనిపోయి ఉండవచ్చని అమెరికాకు చెందిన అంతర్జాతీయ పర్వత గైడ్‌ కంపెనీకి చెందిన ప్రతినిధి తెలిపారు. క్యాంప్‌ 2కు సామాగ్రిని మోసుకెళ్తున్న షెర్పా ఎవరెస్ట్‌పై కూర్చొన్న స్థితిలో మరణించినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎవరెస్ట్‌ శిఖరం నుంచి కిందకు తరలించినట్లు తెలిపారు. ఆయన మరణం ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ కంపెనీ పేర్కొంది. షెర్పా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది.

కాగా,8,848 మీటర్లు.. 29,028 అడుగులతో ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో వందలాది మంది ప్రతి ఏటా ప్రయత్నిస్తుంటారు. అయితే వారి కలల సాకారానికి నేపాలీ గైడ్లు, పోర్టర్లు ఎంతో సహకరిస్తుంటారు. ప్రతి సాహసయాత్ర కోసం అవసరమైన టెంట్లు, ఆహారం, ఆక్సిజన్, తాగునీటి బాటిళ్లను ఎత్తైన శిబిరాలకు మోసుకెళ్లే క్రమంలో అనేక మంది ప్రమాదాలబారినపడి చనిపోతుంటారు. దీంతో ఎవరెస్ట్‌పై మరణించే వారిలో దాదాపు మూడోవంతు వీరే ఉంటారు.

ALSO READ Video Viral: విషం తాగిన మహిళ కోసం ఆ పోలీస్ ఏం చేశాడో చూడండి

మరోవైపు, మంగళవారం నేపాల్ లోని.. ప్రపంచంలోని ఏడవ ఎత్తైన(8,167 మీటర్లు,26,795 అడుగులు)ధౌలగిరి పర్వత శిఖరానికి చేరుకుని దిగుతుండగా అనారోగ్యానికి గురై గ్రీకు అధిరోహకుడు, 59 ఏండ్ల ఆంటోనియోస్‌ సైకారిస్‌ మరణించాడు. 7,400 మీటర్ల ఎత్తులో ఆంటోనియోస్ చనిపోయాడు. ఈ ఘటన అనంతరం తాజాగా నేపాలీ అధిరోహకుడు షెర్పా మరణించడంతో ఎవరెస్ట్‌ క్యాంప్‌ లో విషాదం నెలకొంది.

ప్రపంచంలోని ఎనిమిది ఎత్తైన శిఖరాలకు నిలయం నేపాల్. ఉష్ణోగ్రతలు వెచ్చగా మరియు గాలులు సాధారణంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వసంత కాలంలో వందలాది మంది సాహసికులు వీటిని అధిరోహించేందుకు ప్రయత్నిస్తుంటారు. కోవిడ్ కారణంగా 2020లో వీటిని అధిరోహణపై నిషేధం విధించిన నేపాల్..గతేడాది నుంచి పర్వతారోహకుల కోసం పీక్స్ ను రీఓపెన్ చేసింది. ప్రస్తుతం నేపాల్ లో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో..ఈ సంవత్సరం క్లైంబింగ్ సీజన్ రద్దీగా ఉంటందని నేపాల్‌ లోని యాత్ర నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Nepal

తదుపరి వార్తలు