• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • NELLORE YOUNG MEN KILLED OPPONENT PLAYER WHILE PLAYING BADMINTON IN SULLURPETA OF NELLORE DISTRICT ANDHRA PRADESH PRN

Andhra Pradesh: షటిల్ కోర్టులో షాకింగ్ ఘటన... కత్తులతో ఎంట్రీ ఇచ్చిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..

Andhra Pradesh: షటిల్ కోర్టులో షాకింగ్ ఘటన... కత్తులతో ఎంట్రీ ఇచ్చిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నెల్లూరు జిల్లా (Nellore District) సూళ్లూరుపేటలోని కోళ్లమిట్ట సెంటర్లో గురువారం రాత్రి 10 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన కొంతమంది మంది యువకులు బ్యాడ్మింటన్ (Badminton) ఆడుతున్నారు. మ్యాచ్ మధ్యలో చిన్న వివాదం రేగింది.

  • Share this:
    వాళ్లంతా ఫ్రెండ్స్, ఒకే ప్రాంతంలో ఉంటారు. సరదాగా షటిల్ అడుతున్నారు. ఇంతలో పాయింట్ల విషయంలో గొడవ వచ్చిందో.. లేక పాత గొడవలేమైనా గుర్తుకు వచ్చాయో తెలియదు గానీ ఇద్దరు యువకులు షటిల్ రాకెట్లు వదిలేసి కత్తులతో దాడికి తెగబడ్డారు. ఇద్దరు యువకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వారిలో ఒకరు మృతి చెందగా.. మరో యువకుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని కోళ్లమిట్ట సెంటర్లో గురువారం రాత్రి 10 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన కొంతమంది మంది యువకులు షటిల్ ఆడుతున్నారు. షటిల్ ఆడుతుండగానే చిన్న వివాదం రేగింది. మాటామాట పెరగడంతో వారిలో పవన్, సాయి అనే యువకులు.., అనిల్ కుమార్, మణికంఠ అనే యువకులతో గొడవ పడ్డారు.

    ఇరువురు ఇష్టమొచ్చినట్లు తిట్టుకొని ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన పవన్, సాయి.. సమీపంలోని ఇంటికెళ్లి కత్తులు తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారు. అనిల్ కుమార్ ను విచక్షణరహితంగా కత్తులో పొడిచారు. దీంతో అతడు స్పాట్లోనే చనిపోయాడు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన మణికంఠకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘఠనాస్థలికి చేరుకొని గాయపడ్డ యువకుడ్ని ఆశ్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన పవన్, సాయితో పాటు మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

    పోలీసులు దాడికి పాల్పడిన అనిల్, సాయిపై హత్య కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఘర్షణకు దారితీసిన కారణాలు, అసలేం జరిగిందనే అంశంపై ప్రత్యక్ష సాక్షులను అడిగి స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు. అందరూ ఒకే ప్రాంతానికి చెందిన యువకులు కావడంతో సరదాగా షటిల్ ఆడుకుంటున్నారనుకున్నామని.. ఇంతలోనే ఇంతటి ఘోరం జరిగిందని స్థానికులంటున్నారు. ప్రశాంతంగా ఉంటే సూళ్లూరుపేటలో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. అటు దాడిలో మృతి చెందిన అనిల్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు