• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • NELLORE VIKRAMA SIMHAPURI UNIVERSITY PROFESSOR CHENCHU REDDY ARRESTED BY POLICE SSR

Nellore: ఇంట్లో ఇంటర్ చదివే కొడుకు.. పనిమనిషితో నెల్లూరు ప్రొఫెసర్ రాసలీలలు.. ఆమెను భార్య పనిలో నుంచి తీసేసిందని...

ప్రతీకాత్మక చిత్రం

నెల్లూరులోని బాలాజీనగర్‌లో నివాసం ఉండే చెంచురెడ్డి అనే వ్యక్తి విక్రమ సింహపురి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు ఉన్నారు. అందరికీ చదువు చెప్పే ఈ సారు గారు ఇంట్లో పనిచేసే మహిళతో కామ పాఠాలు నేర్చుకోవాలనుకున్నాడు. ఆ పనిమనిషి కూడా కోరినంత డబ్బులిస్తుండటం, అవసరాలు తీరుస్తుండటంతో ఆ ప్రొఫెసర్‌కు పూర్తిగా సహకరించింది.

  • Share this:
    నెల్లూరు: ఆయన ఓ అధ్యాపకుడు. యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలు బోధించే పవిత్రమైన వృత్తిలో ఉన్న ఆయన పనిమనిషితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఆయనకు ఇంటర్మీడియట్ చదివే కొడుకు కూడా ఉన్నాడు. వయసొచ్చిన కొడుకు ఇంట్లో ఉన్నాడన్న కనీస స్పృహ కూడా లేకుండా పనిమనిషితో వెకిలి వేషాలు వేసేవాడు. భార్య చూస్తుందన్న సిగ్గు కూడా లేకుండా ఆమెతో అదే ఇంట్లో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఆ ప్రబుద్ధుడి వాలకం.. వంటమనిషితో అతని వేషాలు శ్రుతి మించడంతో ఇదేంటని భార్య, కొడుకు నిలదీశారు. ఆ వంటమనిషిని ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో.. ‘నన్నే నిలదీస్తారా’ అన్న చందంగా భార్యాకొడుకు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఓ గదిలో ఆ ప్రొఫెసర్ నిర్భందించాడు. తాళం వేసి వెళ్లిపోయాడు. తల్లీకొడుకు 100కు కాల్ చేసి పోలీసులకు తమను నిర్భందించాడని, వచ్చి కాపాడాలని చెప్పడంతో పోలీసులు వెళ్లి వారికి విముక్తి కల్పించారు. ఈ ఘటన నెల్లూరులోని బాలాజీ నగర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు ఆ ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరులోని బాలాజీనగర్‌లో నివాసం ఉండే చెంచురెడ్డి అనే వ్యక్తి విక్రమ సింహపురి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు ఉన్నారు. అందరికీ చదువు చెప్పే ఈ సారు గారు ఇంట్లో పనిచేసే మహిళతో కామ పాఠాలు నేర్చుకోవాలనుకున్నాడు. ఆ పనిమనిషి కూడా కోరినంత డబ్బులిస్తుండటం, అవసరాలు తీరుస్తుండటంతో ఆ ప్రొఫెసర్‌కు పూర్తిగా సహకరించింది.

    ఇంకేముంది.. ఇంట్లో వంటపని, ఇంటి పని పూర్తి చేసుకున్న వెంటనే ఈ పనిమనిషి, ప్రొఫెసర్ రొమాన్స్ చేసేవారు. వంటగదిలో పనిమనిషి ఉన్నప్పుడు భార్యకొడుకు కళ్లుగప్పి పనిమనిషితో సదరు ప్రొఫెసర్ సరసాలు ఆడేవాడు. కొన్నాళ్లకు చెంచురెడ్డి రాసలీలల సంగతి భార్యాకొడుకుకు తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని, ఇంట్లో ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు ఉన్నాడని భార్య మందలించింది. కొడుకు కూడా తండ్రికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. పనిమనిషిని కూడా పని నుంచి తీసేసి ఇంట్లో నుంచి పంపించేశారు. ఆమెను పనిలో నుంచి తీసేసినప్పటి నుంచి ఈ ప్రొఫెసర్ పద్ధతి మార్చుకోలేదు సరికదా సైకోలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. భార్యను వేధించసాగాడు. మళ్లీ ఆ వంటమనిషిని పనిలోకి తీసుకోవాలని ఒకటే నస పెట్టేవాడు.

    ఇది కూడా చదవండి: EX Lovers: లాక్‌డౌన్‌ వల్ల భార్యాపిల్లలతో సొంతూరికి క్యాబ్ డ్రైవర్.. ఊళ్లో కనిపించిన మాజీ లవర్.. చివరకు ఏమైందంటే..

    కుదరదని భార్య, కొడుకు చెప్పడంతో సోమవారం అర్ధరాత్రి భార్య, కొడుకు ఇంట్లో నిద్రపోతుండగా ఇంటికి తాళం వేసి చెంచురెడ్డి ఎటో వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం చెంచురెడ్డి భార్య, కొడుకు నిద్రలేచి చూసేసరికి బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. చెంచురెడ్డి కూడా కనిపించకుండాపోయాడు. దీంతో.. ఏం చేయాలో పాలుపోని చెంచురెడ్డి కొడుకు 100కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. తన తండ్రే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడని, దయచేసి వచ్చి తమను కాపాడాలని కోరాడు. బాలాజీనగర్ సీఐ మంగారావు, సిబ్బంది చెంచురెడ్డి ఇంటికి వెళ్లి వారిని బయటకు తీసుకొచ్చారు. భర్త వైఖరితో రగిలిపోయిన భార్య చెంచురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. డీఎస్పీ నాగరాజు ప్రొఫెసర్‌ చెంచురెడ్డిపై కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: