• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • NELLORE POOR FAMILY SOLD THEIR 12YEARS OLD DAUGHTER TO 46YEARS MAN FOR RS 10000 AND HE MARRIED MINOR GIRL POLICE BOOKED CASE HERE ARE THE FULL DETAILS PRN

Andhra Pradesh: 46 ఏళ్ల వ్యక్తితో 12 ఏళ్ల బాలిక పెళ్లి... రూ.10వేలకు అమ్మేసిన తల్లిదండ్రులు

ప్రతీకాత్మక చిత్రం

Nellore: కొంతకాలం క్రితం అతడి భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ పేద కుటుంబంలోని చిన్నకుమార్తెపై కన్నేశాడు.

  • Share this:
    0ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లే భావిస్తారు. అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసి ఓ ప్రయోజకుడి చేతిలో పెడతారు. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం ఆడపిల్లను అంగట్లో బొమ్మను చేశారు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కన్నకూతుర్నే అమ్మేశారు. కూతురు వయసున్న బాలికపై కన్నేసిన ఆ వ్యక్తి.. ఆమెను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్లాడు. తీరా రాత్రి సమయంలో బాలిక కేకలు వేయడంతో అసలు విషయం బటపడింది. పోలీసులు ఆ కామాంధుడిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నగరంలోని కొత్తూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేయిస్తున్నారు. చికిత్సకు డబ్బులు లేకపోవడం, కుటుంబ పోషణ కష్టంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    కొత్తూరులోనే నివాసమండే మానికల చినసుబ్బయ్య(46) అనే వ్యక్తి.. ఆ పేద కుటుంబ అవసరాలను ఆసరాగా చేసుకున్నాడు. కొంతకాలం క్రితం అతడి భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ పేద కుటుంబంలోని చిన్నకుమార్తెపై కన్నేశాడు. బాలిక తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి రూ.10వేలకు కొనుగోలు చేశాడు. ఆ బాలికను పెళ్లి చేసుకొని ఈనెల 24న విడవలూరు మండలం, దంపూరులోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. ఐతే రాత్రి సమయంలో బాలిక పెద్దగా ఏడవడంతో స్థానికులు ఆరాతీశారు.

    దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే గ్రామ సర్పంచ్ సురేష్ కు సమాచారమిచ్చి బాలికను మరో ఇంట్లో ఉంచారు. తర్వాతి రోజు గ్రామ సచివాలయ సిబ్బందికి జరిగిన విషయం చెప్పారు.. వారు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే దంపూరుకు చేరుకున్న ఐసీడీఎస్ అదికారులు బాలికను నెల్లూరులోని శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
    Published by:Purna Chandra
    First published: