నెల్లూరులో మహా కిలాడీ.. ఆమె కన్ను పడిందంటే చోరీయే..

ఇటీవలే మరో హాస్టల్లో చేరిన ఆమె అక్కడ ఓ బ్యాంకు ఉద్యోగిని నుంచి రూ.20వేలు దొంగిలించింది. బ్యాంకు ఉద్యోగిని స్నానానికి వెళ్లిన సమయంలో సెల్‌ఫోన్,ఏటీఎం అక్కడే వదిలి వెళ్లింది. ఆమె బాత్‌రూమ్‌లోకి వెళ్లగానే వాటన్నింటిని తీసుకుని ఆ మహిళ ఉడాయించింది.

news18-telugu
Updated: September 13, 2019, 12:06 PM IST
నెల్లూరులో మహా కిలాడీ.. ఆమె కన్ను పడిందంటే చోరీయే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటుపడ్డ ఓ మహిళ.. జైలుకు వెళ్లొచ్చినా తన బుద్ది మార్చుకోలేదు. హాస్టల్స్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ వరుస దొంగతనాలకు పాల్పడటం ఆమెకు అలవాటుగా మారిపోయింది.తాజాగా నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఉన్న ఓ హాస్టల్‌లో బ్యాంకు ఉద్యోగి నుంచి రూ.20వేలు కాజేసింది.బ్యాంకు ఉద్యోగిని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. వింజమూరుకు చెందిన ఓ మహిళ కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది.ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటు పడింది. ఆరేళ్ల క్రితం తొలిసారి ఓ దొంగతనం కేసులో ఆమె అరెస్ట్ అయింది. వింజమూరులో పలు కేసులు నమోదు కావడంతో..అక్కడినుంచి నెల్లూరుకు మకాం మార్చింది. నెల్లూరులోని ఓ హాస్టల్లో ఉంటూ ఓ కంపెనీలో నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తోంది. అయితే రాత్రివేళల్లో హాస్టల్‌లో దొంగతనాలు చేస్తూ.. మరుసటిరోజు మరో హాస్టల్‌కు మారడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. ఇదే క్రమంలో వీఆర్సీ సెంటర్‌లోని ఓ లేడీస్ హాస్టల్లో ఓ మహిళ బంగారు ఆభరణాలను దొంగిలించింది. దీనిపై చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇటీవలే మరో హాస్టల్లో చేరిన ఆమె అక్కడ ఓ బ్యాంకు ఉద్యోగిని నుంచి రూ.20వేలు దొంగిలించింది. బ్యాంకు ఉద్యోగిని స్నానానికి వెళ్లిన సమయంలో సెల్‌ఫోన్,ఏటీఎం అక్కడే వదిలి వెళ్లింది. ఆమె బాత్‌రూమ్‌లోకి వెళ్లగానే వాటన్నింటిని తీసుకుని ఆ మహిళ ఉడాయించింది.బాత్‌రూమ్ నుంచి వచ్చాక తన వస్తువులేవీ కనిపించకపోవడంతో బ్యాంకు ఉద్యోగినికి అనుమానం వచ్చింది. హాస్టల్ యజమాని సహాయంతో సదరు మహిళపై బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు