పుత్తడి పేరుతో ఇత్తడి అమ్మేశారు.. నెల్లూరులో ఘరానా మోసగాళ్లు

రెండు రోజులు తర్వాత ఆభరణాలను నెల్లూరుకు తీసుకెళ్లి.. ఓ బంగారం దుకాణంలో చెక్ చేయిస్తే అవి ఇత్తడి నగలని తేలింది. దాంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: September 18, 2019, 9:09 PM IST
పుత్తడి పేరుతో ఇత్తడి అమ్మేశారు.. నెల్లూరులో ఘరానా మోసగాళ్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మెరిసేదంతా బంగారం కాదు. బంగారు వర్ణంలో ఉన్న నగలన్నీ పసిడి కావు. ఈ నిజం తెలియక చాలా మంది మోసపోతున్నారు. కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకొని నిండా మునుగుతున్నారు. నెల్లూరు జిల్లా సంగంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇత్తడి నగలను బంగారమని నమ్మించి ఇద్దరు వ్యక్తులు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఆ ఘరానా మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఇత్తడి నగలతో పాటు రూ.4లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రాజా తిరుమల నాయక్, గోవింద శ్రీనివాసులు సంగంలో కౌజు పిట్టల వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల వీరి వద్దకు కౌజుల కోసం ఓ వ్యక్తి వచ్చాడు. ప్రస్తుతానికి స్టాక్ లేదని.. వచ్చిన వెంటనే కాల్ చేస్తానని చెప్పి అతడి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత అతడికి ఫోన్‌చేసి.. జేసీబీతో తవ్వుతుంటే తమకు బంగారు ఆభరణం దొరికిందని, తక్కువ ధరకే అమ్ముతామని చెప్పారు. అది పురాతన కాలానికి చెందిన విలువైన నగలని..అప్పట్లో రాజులు ధరించేవారని నమ్మబలికారు.

అవి నిజమైనవో లేదో తేల్చుకునేందుకు ఆ వ్యక్తులు ఆగస్టు 28న ఆ వ్యక్తులు తిరుమల నాయక్, గోవింద శ్రీనివాసుల దగ్గరకు వెళ్లారు. హారంలోని మూడు గుండ్లను తీసి చెక్ చేసుకోవాలని చూపించారు. అవి బంగారమే అని తేలడంతో...రూ.4.50 లక్షల డబ్బు ఇచ్చి నగలు తీసుకున్నారు. రెండు రోజులు తర్వాత ఆభరణాలను నెల్లూరుకు తీసుకెళ్లి.. ఓ బంగారం దుకాణంలో చెక్ చేయిస్తే అవి ఇత్తడి నగలని తేలింది. దాంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి రాజా తిరుమల నాయక్, గోవింద శ్రీనివాసులును అరెస్ట్ చేశారు. వారి స్వస్థలం కడప జిల్లా శికారిపాలం గ్రామమని తెలిపారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>