news18-telugu
Updated: November 26, 2019, 12:21 PM IST
ప్రతీకాత్మక చిత్రం
మైనార్టీ తీరని అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు. ఆతర్వాత మూడేళ్లు కాపురం కూడా చేశాడు. ఆ అమ్మాయిని తల్లి చేయడమే కాకుండా... ఇప్పుడు మరో యువతిని ఏంచెక్కా పెళ్లి చేసుకున్నాడు. ఈఘటన నెల్లూరు టూ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. నవాబ్‌పేట గ్రామానికి చెందిన ఓ బాలికకు 17 ఏళ్లు. అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివింది. ఆ సమయంలో స్నేహితురాలి ద్వారా వలేటివారిపాలెం మండలం సింగమనేనిపల్లెకు చెందిన బత్తిన వెంకట సురేంద్ర పరిచయమయ్యాడు. బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడ్డాడు. ఇద్దరూ కలిసి తిరిగారు ఆ తర్వాత ఒక రోజు నెల్లూరులో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇదంతా మూడేళ్ల క్రితం జరిగింది. ఆ తర్వాత అబ్బాయి తల్లిదండ్రులకు వీరి పెళ్లి విషయం తెలిసి... ఒప్పుకున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో నివాసం ఏర్పాటుచేశారు.
అమ్మాయికి మొదట బిడ్డ పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత రెండో కాన్పులో మరో బిడ్డ జన్మించాడు. కొన్నాళ్లకు వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో బాలిక భర్త సురేంద్రపై అలిగి అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. ఆమె ఎంత బతిమాలినా కాపురానికి రాకపోవడంతదో సురేంద్ర మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక సురేంద్ర ఇంటికి వచ్చి నిలదీసింది. దీంతో అతడు రెండో భార్యకు ఏదోవిధంగా నచ్చజెప్పి పంపిస్తామని, లేకపోతే ఇద్దరితోనూ కాపురం చేస్తానని నచ్చజెప్పాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించింది. మైనార్టీ తీరకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్న సురేంద్రపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు. మైనర్ బాలికను ఆమె ఇష్టంతో పెళ్లి చేసుకున్న అది చట్టా రిత్యా నేరం కిందకే వస్తుందన్నారు. కేసునమోదు చేసి విచారణ చేపట్టారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
November 26, 2019, 12:21 PM IST