ఖాకీలకు చిక్కిన దేవాలయాల దొంగ... నగలు, నగదు స్వాధీనం

బెయిల్ పై వచ్చిన శివ జిల్లాలోని జలదంకి, బిట్రగుంట, టిపి గూడూరు, కావలి రూరల్, వెంకటాచలం, జలదంకి పోలీస్ స్టేషన్లు, ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు, ఉలవపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ ఆలయాల్లో హుండీలు పగులగొట్టి నగలు, నగదు తీసుకెళ్లాడు.

news18-telugu
Updated: July 13, 2020, 7:19 PM IST
ఖాకీలకు చిక్కిన దేవాలయాల దొంగ... నగలు, నగదు స్వాధీనం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేవాలయాల్లో అర్ధరాత్రి వేళ చొరబడి చోరీలకు పాల్పడుతున్న దొంగను నెల్లూరు జిల్లా సీసీఏస్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సిసిఎస్ సిఐ బాజీజాన్ సైదా విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. . జిల్లాలోని టిపి గూడూరు మండలం, పాతకోడూరుకు చెందిన పల్లికొండ శివ అనే వ్యక్తి గతంలోనే వివిధ నేరాలు చేసి జైలుకు వెళ్లాడు. బెయిల్ పై వచ్చిన శివ జిల్లాలోని జలదంకి, బిట్రగుంట, టిపి గూడూరు, కావలి రూరల్, వెంకటాచలం, జలదంకి పోలీస్ స్టేషన్లు, ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు, ఉలవపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ ఆలయాల్లో హుండీలు పగులగొట్టి నగలు, నగదు తీసుకెళ్లాడు. అలాగే పలు ఇతర ఆలయాల్లో కూడా చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్నాడు.

దేవాలయాల దొంగ అరెస్టు


ఈ చోరీలపై దర్యాప్తు చేపట్టిన నెల్లూరులోని సెంట్రల్ క్రైం విభాగం సోమవారం శివను అరెస్ట్ చేసి దొంగతనం చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిపై గతంలో రెండు హత్య కేసులు, దేవాలయాల్లో చోరీ కేసులు, ఇళ్లల్లో దొంగతనం కేసులు ఉన్నాయన్నారు.
Published by: Krishna Adithya
First published: July 13, 2020, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading