నెల్లూరులో దారుణం...చికెన్ షాపులో 300 కేజీల కుళ్లిన మాంసం చూసి అధికారులు షాక్..

సోమవారం అధికారులు చేపట్టిన సోదాల్లో వ్యాపారులు చేస్తున్న మోసం బయటపడింది. కుళ్లిన మాంసం, చికెన్ కేజీల కొద్ది బయటపడింది.

news18-telugu
Updated: August 26, 2019, 10:39 PM IST
నెల్లూరులో దారుణం...చికెన్ షాపులో 300 కేజీల కుళ్లిన మాంసం చూసి అధికారులు షాక్..
దాడుల్లో స్వాధీనం చేసుకున్న మాంసం
  • Share this:
ప్రజల ప్రాణాలతో కల్తీరాయుళ్లు చెలగాటమాడుతున్నారు. పనికిరాని, పాడేయాల్సిన మాంసాన్ని దర్జాగా ప్రజల ఆరోగ్యాన్నిపణంగా పెడుతూ అంటగడుతున్నారు. ముఖ్యంగా ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి, జనాలకు కట్టబెడుతున్నారు. కుళ్లిన మాంసంతో రోగాలు రావడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నా, అధికారులు దాడులు నిర్వహిస్తున్నా వ్యాపారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నెల్లూరు టౌన్ పద్మావతి సెంటర్లో ఓ చికెన్ షాపులో నిల్వ ఉంచిన 300 కేజీల మాంసాన్ని ఆకస్మిక దాడులు చేసి నగరపాలక సంస్థ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగర కార్పోరేషన్ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రజలు కార్పోరేషన్ గుర్తించిన జంతు వధశాలల నుంచి తెచ్చిన మాంసాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ఇకపై నగరంలోని రెస్టారెంట్లు, బార్లు సహా అన్ని ఆహార దుకాణాలపై ఈ తరహా మెరుపుదాడులు చేస్తామని కార్పోరేషన్ అధికారులు హెచ్చరించారు.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>