హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: శవానికి వైద్యం... లక్షలు వసూలు.... సినిమా కాదు నిజమే... ఎక్కడో తెలుసా..?

Andhra Pradesh: శవానికి వైద్యం... లక్షలు వసూలు.... సినిమా కాదు నిజమే... ఎక్కడో తెలుసా..?

చనిపోయిన రోగిని ఆసుపత్రి నుండి షిప్టు చేయాలనే ప్రయత్నం చేయడంతో ఆసుపత్రిపై వైద్యులపై అనుమానంతో ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు . వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందంటూ శవంతో బైఠాయించారు. (ప్రతీకాత్మక చిత్రం

చనిపోయిన రోగిని ఆసుపత్రి నుండి షిప్టు చేయాలనే ప్రయత్నం చేయడంతో ఆసుపత్రిపై వైద్యులపై అనుమానంతో ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు . వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందంటూ శవంతో బైఠాయించారు. (ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: పేరు మారినా.. వారి బుద్ధి మాత్రం మారలేదు. కిడ్నీలతో వ్యాపారం చేసి అప్రతిష్ట పాలైన సింహపురి ఆస్పత్రి ఇప్పుడు మెడికవర్ గా పేరు మార్చుకొని రోగుల రక్తాన్ని పీల్చుతోంది.

  పేరు మారినా.. వారి బుద్ధి మాత్రం మారలేదు. కిడ్నీలతో వ్యాపారం చేసి అప్రతిష్ట పాలైన సింహపురి ఆస్పత్రి ఇప్పుడు మెడికవర్ గా పేరు మార్చుకొని రోగుల రక్తాన్ని పీల్చుతోంది. వైద్యం కోసం వచ్చిన వారి బలహీనతను ఆసరాగా చేసుకొని భారీగా ఫీజులు గుంజుతోంది. వీరి కాసుల కక్కుర్తి ఏ రేంజ్ లో ఉందంటే ఠాగూరు సినిమాలో మాదిరిగా చనిపోయిన వ్యక్తికి చికిత్స చేస్తున్నామని నటిస్తూ బాధితుల నుంచి లక్షలు వసూలు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన బాషా, సైదా భార్యాభర్తలు. రెండు రోజుల క్రితం కుటుంబ కలహాలతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన భాషా.., సైదాను కత్తితో పొడిచాడు.

  భర్త దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో బాషా కూడా పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరోవైపు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న సైదా పరిస్థితిని చూసి ఆందోళన చందిన ఆమె కుమారులు ఎలాగైన కాపాడలని డాక్టర్లను వేడుకున్నారు. ఇక్కడే మెడికవర్ ఆస్పత్రి కాసుల కక్కుర్తి బయటపడింది. కుటుంబ సభ్యులు అడిగినంత డబ్బు ఇస్తుండటంతో అందినకాడికి వసూలు చేశారు. పక్కా స్కెచ్ వేసి సైదాకు చికిత్స చేస్తున్నట్లు కుటుంబ సభ్యులను నమ్మించి ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేశారు.

  చికిత్స పేరుతో పదే పదే డబ్బులు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సైదాను చూపించాలని డిమాండ్ చేశారు. తొలుత బుకాయించిన ఆస్పత్రి సిబ్బంది... ఆ తర్వాత సైదా చనిపోయిందంటూ చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఆస్పత్రి నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సైదా కుటుంబ సభ్యులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Crime, Nellore

  ఉత్తమ కథలు