నెల్లూరులో యువతి ఆత్మహత్య.. సూసైడ్ సెల్ఫీని ముగ్గురు యువకులకు పంపి..

యువతి ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె తన సెల్ఫీ వీడియోను తీసి ముగ్గురు యువకులకు పంపింది.

news18-telugu
Updated: July 11, 2020, 2:27 PM IST
నెల్లూరులో యువతి ఆత్మహత్య.. సూసైడ్ సెల్ఫీని ముగ్గురు యువకులకు పంపి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నెల్లూరులో దారుణం జరిగింది. ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె తన సెల్ఫీ వీడియోను తీసి ముగ్గురు యువకులకు పంపింది. నెల్లూరు బీవీ నగర్‌కు చెందిన శివభార్గవ్ అనే యువకుడి మీద చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బీవీనగర్‌కు చెందిన శివభార్గవ్ అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. అతడు అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలోకి దింపుతాడని ఆరోపించారు. అలాగే, ఢిగ్రీ సంవత్సరం చదువుతున్న యువతిని కూడా ప్రేమ పేరుతో ట్రాప్ లోకి లాగాడు. అయితే, వారి మధ్య ఏం జరిగిందో తెలీదు. యువతి కుటుంబసభ్యులు బయటకు వెళ్లినప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉరి వేసుకోవడానికి ముందు శివభార్గవ్, అతడి స్నేహితులు వాసు, సాయి కిరణ్ అనే మరో ఇద్దరితో వాట్సాప్ చాటింగ్ చేసింది. తాను ఉరి వేసుకుంటున్నానని వారికి చెప్పింది. అయినా కూడా వారెవరూ కనీసం ఆమె కుటుంబసభ్యులను హెచ్చరించలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

మృతురాలి సోదరుడు మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె సూసైడ్ చేసుకుందని, ఆ సమయంలో తాను, శివభార్గవ్ ఒకేచోట ఉన్నామని, కనీసం ఇలా సూసైడ్ చేసుకుంటుందనే విషయాన్ని కూడా తనకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క మాట చెప్పినా తన అక్క ప్రాణం కాపాడుకునే వాడినని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రోజు సాయంత్రం ఆమె ఫోన్ చెక్ చేస్తే అసలు విషయం తెలిసిందని చెప్పారు. శివ భార్గవ్‌ సుమారు 10 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడని అతడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 11, 2020, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading