నెల్లూరులో ఘరానా దొంగ అరెస్టు...నివ్వెరపోయిన పోలీసులు...

ముఖ్యంగా షాపులు, షోరూంలే టార్గెట్ గా నిందితుడు శివ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇన్నోవా కారును సైతం మాయం చేసి దాన్ని దొంగతనాలకు ఉపయోగించుకోవడం కొసమెరుపు.

news18-telugu
Updated: August 19, 2019, 4:00 PM IST
నెల్లూరులో ఘరానా దొంగ అరెస్టు...నివ్వెరపోయిన పోలీసులు...
నిందితుడు శివను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన నెల్లూరు జిల్లా పోలీసులు
  • Share this:
నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.18,50,000 విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఉప్పు శివనారాయణ అలియాస్ శివ 2016 నుంచి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా షాపులు, షోరూంలే టార్గెట్ గా నిందితుడు శివ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇన్నోవా కారును సైతం మాయం చేసి దాన్ని దొంగతనాలకు ఉపయోగించుకోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే సోమవారం నిందితుడు శివను నెల్లూరు టౌన్ సమీపంలోని శిల్పారామం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడి పాత నేరాలతో పాటు ఇటీవల పాల్పడిన దొంగతనాలు బయటపడ్డాయి.

నిందితుడి నుంచి జప్తు చేసిన సొమ్ముతో పాటు ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న విలువైన వస్తువుల్లో 11 కేజీల వెండి ఆభరణాలు, రెండు కేజీల బంగారు ఆభరణాలు ఉండటంతో పోలీసులు నివ్వెరపోతున్నారు. ఇదిలా ఉంటే నిందితుడు శివను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు