8 ఏళ్ల బాలికపై అత్యాచారం...ఇద్దరు దోషులకు జీవిత ఖైదు

రేప్ కేసుపై నెల్లూరు 1వ అదనపు జిల్లా కోర్టులో రెండేళ్లుగా విచారణ జరుగుతోంది. ఇద్దరు నిందితులపై నేరం రుజువుకావడంతో వారికి జీవిత ఖైదు విధించింది కోర్టు.

news18-telugu
Updated: August 20, 2019, 10:31 PM IST
8 ఏళ్ల బాలికపై అత్యాచారం...ఇద్దరు దోషులకు జీవిత ఖైదు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రెండేళ్ల కిందటి మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు యువకులకు జీవితఖైదు శిక్షపడింది. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఇరువురినీ దోషులుగా తేల్చిన నెల్లూరు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. 2017 జూన్‌లో నెల్లూరు జిల్లా కావలిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఓరుగంటి సునీల్ కుమార్, మచ్చల వెంకయ్య అనే యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసుపై నెల్లూరు 1వ అదనపు జిల్లా కోర్టులో రెండేళ్లుగా విచారణ జరుగుతోంది. ఇద్దరు నిందితులపై నేరం రుజువుకావడంతో వారికి జీవిత ఖైదు విధించింది కోర్టు.
First published: August 20, 2019, 10:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading