తల్లీకూతుళ్ల హత్య కేసులో దోషికి ఉరిశిక్ష.. నెల్లూరు కోర్టు సంచలన తీర్పు

2013 ఫిబ్రవరి 12న నెల్లూరు హరినాథపురానికి చెందిన దినకర్ రెడ్డి భార్య శకుంతల, మెడిసిన్ చదువుతున్న వారి కూతురు భార్గవిని ఇంట్లోనే దుండగులు హత్య చేశారు.


Updated: February 6, 2020, 5:34 PM IST
తల్లీకూతుళ్ల హత్య కేసులో దోషికి ఉరిశిక్ష.. నెల్లూరు కోర్టు సంచలన తీర్పు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
2013 జంట హత్యల కేసులో నెల్లూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తల్లీకూతుళ్లను చంపిన కేసులో నిందితుడు షేక్ ఇంతియాజ్‌ను దోషిగా తేల్చిన ఎనిమిదో అదనపు న్యాయమూర్తి సత్యనారాయణ.. అతడి ఉరిశిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. కాగా, 2013 ఫిబ్రవరి 12న నెల్లూరు హరినాథపురానికి చెందిన దినకర్ రెడ్డి భార్య శకుంతల, మెడిసిన్ చదువుతున్న వారి కూతురు భార్గవిని ఇంట్లోనే దుండగులు హత్య చేశారు.

దినకర్ రెడ్డి వాగ్దేవి డి-ఫార్మసీ కాలేజికి కరెస్పాండెంట్‌గా పనిచేసేవారు. ఐతే ఆయన నూతన గృహానికి ప్లాన్ ఇచ్చేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. అతడి భార్య శకుంతల, కూతురు భార్గవిపై కత్తులు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్ర గాయాలు కావడంతో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే చనిపోయారు. ఆ హత్యల కేసుకు సంబంధించి గురువారం నెల్లూరు కోర్టు తీర్పు చెప్పింది. ఇంతియాజ్‌కు ఉరిశిక్ష విధించడంపై మృతుల బంధువులు హర్షం వ్యక్తం చేశారు.First published: February 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు