హోమ్ /వార్తలు /క్రైమ్ /

నెల్లూరు టూరిజం ఆఫీసులో ఉద్యోగినిపై దాడి కేసు.. వారంలోనే చార్జ్ షీట్..

నెల్లూరు టూరిజం ఆఫీసులో ఉద్యోగినిపై దాడి కేసు.. వారంలోనే చార్జ్ షీట్..

మహిళా ఉద్యోగినిపై దాడి చేస్తున్న సహోద్యోగి (కుడివైపు చివర)

మహిళా ఉద్యోగినిపై దాడి చేస్తున్న సహోద్యోగి (కుడివైపు చివర)

మాస్కు పెట్టుకోమని అడిగినందుకు కుర్చీ కర్రతో దారుణంగా కొట్టారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయింది.

    కేసుల విచారణలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేశారు. సహజంగా ఏదైనా కేసు నమోదైతే, విచారణ పేరిట కాలం గడుపుతారనే అభిప్రాయం పోలీసుల మీద ఉంటుంది. కానీ, ఈ కేసులో మాత్రం పోలీసులు కేవలం వారం రోజుల్లోనే చార్జిషీట్ వేశారు. నెల్లూరులోని ఏపి టూరిజం హోటల్ డివిజనల్ కార్యాలయంలో గత నెల 27వ తేదీనా డిప్యూటీ మేనేజర్ భాస్కర్ అదే కార్యాలయంలో పనిచేసే దివ్యాంగురాలైన సీనియర్ అసిస్టెంట్ ఉషారాణిపై దాడి చేశారు. మాస్కు పెట్టుకోమని అడిగినందుకు కుర్చీ కర్రతో దారుణంగా కొట్టారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయింది. అది బయటకు వచ్చింది. ఈ కేసును ఎస్పీ భాస్కర్ భూషణ్ దిశ పోలీసులకు అప్పగించారు. దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ నాగరాజు కేసుకు మరికొన్ని సెక్షన్లు జోడించి కేవలం మూడు రోజుల్లోనే దర్యాప్తును పూర్తి చేశారు. ఆ వెంటనే కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అన్నీ సెక్షన్లతో కలిసి ముద్దాయికి గరిష్ఠంగా రెండేళ్ల నుండి ఐదేళ్ల వరకూ న్యాయ స్థానం శిక్ష విధంచే అవకాశం ఉంది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Disha police station, Nellore Dist

    ఉత్తమ కథలు