వామ్మో.. ఇదేమి లొల్లిరా నాయినా.. కుక్కని కుక్కా అని పిలిచాడని ఆరుగురి తలలు పగలాయి!

Gurugram Dog Owner Beats Neighbours

ఈ ఘర్షణ సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం సుదీర్ పెంపుడు శనకాన్ని.. కుక్కా అని పిలిచినందుకు తనను కొట్టారంటూ పోలీసులు ఫిర్యాదు చేశాడు

  • Share this:


    తను అపూరూపంగా పెంచుకుంటున్న శునకాన్ని కుక్కని అని పిలిచినందుకు పెద్ద గొడవకు దిగాడో వ్యక్తి. ఈ గొడవ తీవ్రమైన ఘర్షణకు దారి తీసింది. చిలికి చిలికి గాలివానలా మారి హింసాత్మకమైంది. హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని జ్యోతిపార్క్‌ ప్రాంతంలో ఓ కుటుంబం టామీ అనే కుక్కని పెంచుకుంటుంది. ఆయితే ఈ శునకం స్థానికులపై ఎగబడుతూ,కరవడం చేస్తుండేది. దీంతో సుధీర్‌ అనే వ్యక్తి కుక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అది పిల్లల్ని కరుస్తోందని యజమానికి వివరించాడు. అతని మాటలు విన్న యజమాని మా టామీని కుక్క అని పిలుస్తావా? అంటూ కుటుంబ సభ్యులతో కలిసి దాడికి దిగాడు. రాడ్‌తో అతనిపై దాడికి దిగడంతో.. సుధీర్ కుటుంబ సభ్యులు కూడా అక్కడి చేరుకుని వారిని అపే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై కూడా దాడికి దిగి ఆరుగుర్ని తీవ్రంగా గాయపరిచారు.    ఈ ఘర్షణ సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం సుదీర్ పెంపుడు శనకాన్ని.. కుక్కా అని పిలిచినందుకు తనను కొట్టారంటూ పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఇక గుర్‌గ్రామ్ ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయని పోలీసులు తెలిపారు. కరోనా లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కుక్క గురించి తలలు పగిలేలా కొట్టుకోవడం ఏమిటోనని పోలీసులు వాళ్ళను హెచ్చరించారు నెటిజన్లు కూడా ఈ ఘర్షణపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కుక్కని కుక్కా అని పిలవకూడదా? అంత మాత్రనా తలలు పగలగొట్టాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Rekulapally Saichand
    First published: