8 ఏళ్ల బాలికను గొంతుకోసి చంపిన పొరుగింటి వ్యక్తి.. టీవీ పెట్టమన్నందుకు..

బాలికను చంపేసిన తర్వాత.. శవాన్ని ప్లాస్టిమ్ డ్రమ్‌లో పెట్టి, ఎవరూ చూడకుండా మూతమూశాడు. ఆ తర్వాత కాసేపటికి శవాన్ని తీసుకెళ్లి ఇంటికి సమీపంలో ఉన్న వంతెన మీది నుంచి నీటిలోకి విసిరేశాడు.

news18-telugu
Updated: July 16, 2020, 12:28 PM IST
8 ఏళ్ల బాలికను గొంతుకోసి చంపిన పొరుగింటి వ్యక్తి.. టీవీ పెట్టమన్నందుకు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
8 ఏళ్ల పసిపాపను పొరుగింటి వ్యక్తి దారుణంగా చంపేశాడు. టీవీ పెట్టాలని అడిగినందుకు గొంతుకోసి హత్యచేశాడు. తమిళనాడులోని ట్యూటికోరిన్‌లో ఈ ఘోరం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడో తరగతి చదువుతున్న బాలిక తన తల్లితో కలిసి నివసిస్తోంది. ఐతే వారి ఇంట్లో టీవీ లేదు. అప్పుడప్పుడూ పక్కింటికి వెళ్లి టీవీ చేసేంది. ఈ క్రమంలో బుధవారం సైతం పొరిగింటికి టీవీ చూసేందుకు వెళ్లింది. ఐతే అప్పటికే ఇంటి యజమాని, తండ్రితో గొడవపడుతున్నాడు. అదే సమయంలో బాలిక టీవీ పెట్టమని అడగడంతో.. తండ్రిపై ఉన్న కోపాన్ని ఆ చిన్నారిపై చూపించాడు. చిన్నారిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.

బాలికను చంపేసిన తర్వాత.. శవాన్ని ప్లాస్టిమ్ డ్రమ్‌లో పెట్టి, ఎవరూ చూడకుండా మూతమూశాడు. ఆ తర్వాత కాసేపటికి శవాన్ని తీసుకెళ్లి ఇంటికి సమీపంలో ఉన్న వంతెన మీది నుంచి నీటిలోకి విసిరేశాడు. మృతదేహాన్ని నీటితో పడేస్తుండగా ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాపను చంపేసిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: July 16, 2020, 12:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading