Home /News /crime /

NEIGHBOR RAPE 3 YEAR OLD BABY GIRL ON PRETEXT OF FEEDING MANGOES IN REWA MADHYAPRADESH PVN

Shocking : అన్న మామిడిపండు ఇస్తానన్నాడని ఇంటికెళ్లిన మూడేళ్ల బాలిక..దారుణానికి బడిగట్టిన యువకుడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rape On child : ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలివాళ్ల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు కామాంధులు.

Rape On child : ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలివాళ్ల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు కామాంధులు. ఆడది అయితే చాలు అన్నట్లుగా ఏ వయస్సువారిపైనైనా అత్యాచారాలు చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో 3 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మామిడికాయలు తినిపిస్తానని చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడడు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలోని సెమారియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

రేవా జిల్లాలోని సెమారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని తన మేనమామ ఇంటికి తల్లితో కలిసి వచ్చింది బాలిక. సోమవారం సాయంత్రం బాలిక తన తల్లితో కలిసి ఆడుకుంది. అదే సమయంలో పొరుగింట్లో నివసించే నిందితుడు రాజేంద్ర సాకేత్..బాలికను ఇంటికి చేరుకున్నాడు మామిడి పళ్లు తినిపిస్తానని చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లి..పసిబిడ్డ అని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఎంతసేపటికి బాలిక ఇంటికి రాకపోవడంతో బాలిక అత్త ఆమెను తీసుకెళ్లేందుకు పక్కింటి యువకుడి ఇంటికి చేరుకుంది. అక్కడ రాజేంద్ర.. బాలికపై చేస్తున్న దారుణం చూసి షాక్ అయింది. కొంతసేపటికి బాలిక తల్లి కూడా అక్కడికి చేరుకుంది. రాజేంద్రను చితకబాది బాలికను అక్కడినుంచి తీసుకెళ్లారు. రాజేంద్రపై బాలిక కుటుంబసభ్యులు మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు మహిళా స్టేషన్‌ ఇన్‌చార్జి నిషా మిశ్రా తెలిపారు.



Marriage : కోడలికి మరొకరితో పెళ్లి చేసిన అత్తమామలు..కాళ్లు కడిగి కన్యాదానం..ఎందుకో తెలుసా

మరోవైపు,ప్రేమలో మోసాలు గురించి మనం అనేకసార్లు వింటుంటాం. కానీ కట్టుకున్న భర్త భార్యను మోసం చేయడం.. అది కూడా ఎవరూ ఊహించని విధంగా ఆమెను వేధించడం గురించి చాలా తక్కువసార్లు వినుంటాం. ఉత్తరప్రదేశ్ లోని చందౌలీలోని ఇలియా ప్రాంతంలో మోసానికి సంబంధించిన విచిత్రమైన కథ తెరపైకి వచ్చింది. ఇక్కడ ఓ దుర్మార్గుడైన యువకుడు మొదట అమ్మాయిని (Girl) తన ప్రేమ(Love) వలలో వేసుకున్నాడు. తన ప్రేమలో ఆమె పూర్తిగా కూరుకుపోయి తన మాట తప్ప మరెవరి మాట వినకుండా ఉండేలా చేసుకున్నాడు. ఆ తరువాత అమ్మాయితో కలిసి ఇంటి నుంచి పారిపోయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన భర్త గురించి ఆమె అప్పటివరకు గొప్పగా ఊహించకుంది. తన భర్త ప్రేమకు మరేది సాటిరాదని ఆ మహిళ భావించింది. కానీ తన భర్త మనసులో క్రూరమైన ఆలోచన ఉందని ఆమెకు అప్పటివరకు తెలియదు. తనకు సంబంధించిన అశ్లీల వీడియో, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం మహిళకు షాక్ ఇచ్చేలా చేసింది. దీనిపై ఆమె నిరసన వ్యక్తం చేయడంతో తన భర్త తనను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని బాలిక ఆరోపించింది.

OMG : యువకుడి ప్రైవేట్ పార్ట్ లో నుంచి కడుపులోకి టార్చ్ లైట్ తోసిన నిందితులు అరెస్ట్

ఈ ఘటనతో బాధిత యువతి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని యువకుడిపై కేసు పెట్టింది. బాలిక ఇచ్చిన వివరాల ప్రకారం.. తియేరీ గ్రామానికి చెందిన సుజిత్ యాదవ్ బాలికను తన ప్రేమ వలలో ఇరికించి 3 నెలల క్రితం లక్నోకు తీసుకెళ్లాడు. అక్కడ గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. మే 20వ తేదీన సుజిత్ తన ఇంటికి తియేరీకి వచ్చి అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశాడని ఆరోపించారు. ఆ వీడియో ఫోటో వైరల్ అయిందని తన భర్తకు తెలియడంతో ఆమె తీవ్ర ప్రతిఘటన వ్యక్తం చేసింది. దీనిపై భర్త సుజిత్ ఆమెను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో బాలిక ఇలియా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడిపై వైద్య పరీక్షలతో పాటు ఐపిసి సెక్షన్ 376, 354, 323, 504 మరియు 67a కింద కేసు నమోదు చేశారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు ఆమెకు వైద్య పరీక్షలు చేశామన్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Child rape, Madhya pradesh

తదుపరి వార్తలు