హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime : ప్రాణాలు తీసిన పక్కింటాయన.. తండ్రీ, కొడుకూ మృతి..

Crime : ప్రాణాలు తీసిన పక్కింటాయన.. తండ్రీ, కొడుకూ మృతి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime : శత్రుశేషం ఉండకూడదని చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు. శత్రువులతో ఎప్పటికైనా ప్రమాదమే. అందుకు ఉదాహరణగా మిగిలింది ఈ కేసు. ఎలా జరిగిందో, ఏమైందో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మనం కరెక్టుగా ఉండాలని మన పక్కింటివాళ్లు కోరుకుంటారు.. అదే విధంగా.. వారు కరెక్టుగా ఉండాలని మనం కోరుకుంటాం. అంతా బాగానే ఉంటే.. పొరుగింటి వాళ్లతో మనకూ సఖ్యత ఉంటుంది. అదే తేడా వస్తే.. శత్రువులు ఎక్కడో ఉండరు.. పక్కింట్లోనే ఉంటారు. అలాంటి సందర్భం.. కేరళ.. త్రిచూర్‌లోని చెర్ప్ పల్లిసెరీలో జరిగింది. రాత్రి పది గంటలకు పక్కింటాయనతో గొడవ జరిగింది. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఆయన.. కత్తితో వచ్చి.. 62 ఏళ్ల చంద్రన్, 32 ఏళ్ల జితిన్ కుమార్‌ని పొడిచేశాడు. రాత్రి 10.30కి ఈ ఘటన జరిగింది. ఈ దారుణంలో ఇద్దరూ చనిపోయారు.

పక్కింట్లో ఉంటున్న వెలప్పన్.. ఈ దారుణానికి పాల్పడిన తర్వాత.. తండ్రీ, కొడుకును స్థానికులు దగ్గర్లోని కుర్కంచెరీ ఎలైట్ మిషన్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ చేస్తుండగా.. ఇద్దరూ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న చెర్ప్ పోలీసులు.. అప్పటికప్పుడే సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి.. వెలప్పన్‌ని పట్టుకొని అరెస్టు చేశారు.

Thrilling video : అదృష్టం అతన్ని బంకలా పట్టుకుంది.. వీడియో చూడండి

గొడవేంటి?

వెలప్పన్ పాత నేరస్థుడు. అతను చెర్ప్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని నేరాలు చేశాడు. జైలుకెళ్లి వచ్చాడు. మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి అతను స్థానిక గ్యాంగ్‌స్టర్‌తో చేతులు కలిపాడు. పద్ధతీ పాడూ లేకుండా ఉండేవాడు. అతని తీరు వల్ల చంద్రన్ కుటుంబానికి ఇబ్బంది అయ్యేది. పక్కింట్లోనే ఉంటారు కాబట్టి.. వెలప్పన్‌తో అప్పుడప్పుడూ వాదనలు జరిగేవి. కానీ వెలప్పన్ పాత నేరస్థుడని చంద్రన్ ఫ్యామిలీకి తెలియదు.

ఎప్పుడు గొడవ జరిగినా.. మాటలతోనే తిట్టుకునేవారు. ఏనాడూ కొట్టుకున్నది లేదు. అందువల్ల సోమవారం రాత్రి కూడా ఇలాగే వాదన జరిగింది. ఈసారి మాత్రం వెలప్పన్ ఏ మూడ్‌లో ఉన్నాడో గానీ.. ఏకంగా కత్తితో పొడిచేశాడు. ఆవేశంలో అతను ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. అతని తీరు వల్ల అతను మళ్లీ జైలు పాలవ్వడమే కాదు.. పక్కింట్లో ఇద్దరి ప్రాణాలు కూడా పోయాయి. శత్రువులతో అప్రమత్తంగా ఉండాలి. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

First published:

Tags: Crime news, Crime story, Kerala

ఉత్తమ కథలు