దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు బెంబెలెత్తిస్తున్నాయి. శనివారం రోహిణి సవ్దా గ్రామంలోని డెయిరీ ఫామ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంత మంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్న 20 కి పైగా ఆవులు చూస్తుంగడానే కాలిపోయాయి. వెంటనే స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. దాదాపు ఏడు ఫైరింజన్ లో సంఘటన స్థలానికి చేరుకున్నాయి. స్థానికుల సహయంతో అధికారులు సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఢిల్లీ అగ్నిప్రమాద (Delhi Fire Accident) ఘటన నిన్న జరిగింది.
దీనిలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మంటలు చల్లారిన తర్వాత ఆ భవనంలో రెస్క్యూ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మూడో అంతస్తులో కొన్ని చోట్ల మాంసపు ముద్దలు కనిపించాయని.. అవి మానవ మృతదేహాలవేనని అధికారులు స్పష్టం చేశారు. ఐతే ఎన్ని శవాలున్నాయన్న దానిపై స్పష్టత లేదు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి.. ముక్కలముక్కలవడంతో.. లెక్కించడం కష్టంగా మారింది. అర్ధరాత్రి వరకు 27 మృతదేహాలను వెలికితీశారు. ఇవాళ మూడో అంతస్తులో మరికొన్ని మానవ అవయవాలు లభించడంతో.. మరో ముగ్గురు (Delhi Fire Mishap) మరణించిన ఉండొచ్చని అధికారులు తెలిపారు. మొత్తం 30 మంది మరణించినట్లుగా భావించవచ్చని పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని కీలక వివరాలను అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాద సమయంలో ఓ గదిలో మీటింగ్ జరిగిందని.. 50 మంది వరకు దానికి హాజరయ్యారని పేర్కొన్నారు. ఆ గదిలోనే ఎక్కువ శవాలు లభ్యమయినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని ముంద్కా మెట్రో స్టేషన్ (Mundka Metro station)సమీపంలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ముంద్కా మెట్రో స్టేషన్ 544వ నంబరు స్తంభం వద్ద ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో పెద్ద ఎత్తున మంటలు (Delhi Fure Accident) ఎగిసిపడ్డాయి. సాయంత్రం 04.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 24 ఫైరింజన్లను రంగంలోకి దించారు. ఓ వైపు మంటలు అదుపు చేస్తూనే.. మరోవైపు భవనంలోని కార్యాలయాలలో చిక్కుకున్న పలువురిని కాపాడారు. దాదాపు 70 మందిని కాపాడి భవనం నుంచి బయటకు తీసుకొచ్చారు. మరికొందరు మాత్రం మంటల్లో కాలిపోయి మరణించారు. వారి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీశారు. ఐతే ఇంకా కొంద మంది ఆచూకీ మాత్రం దొరకలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cow, Delhi, Fire Accident