నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) గత కొన్ని రోజులుగా ముంబైలో దాడులు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో NCB ముంబైలోని ఒక పెద్ద క్రూయిజ్ షిప్‌లో సోదాలు నిర్వహించింది. ఈ క్రూయిజ్‌లో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను (Narcotics )స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అందులో ఒక బాలీవుడ్ బడా హీరో కుమారుడి (Son of Bollywood big hero)ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ముంబైలోని సముద్రంలో కార్డెలియా క్రూయిజర్ (Cordelia cruiser)లో పార్టీ జరిగింది. ఈ పార్టీ (Party)కి ధనిక కుటుంబాలు (Richest families), పలువురు ప్రముఖులు (Celebrities') హాజరయ్యారు. పార్టీలో డ్రగ్స్ (drugs) వాడినట్లు ఎన్‌సీబీ బృందానికి సమాచారం అందింది. దీంతో ఎన్‌సీబీ స్క్వాడ్ (Squad) దాడి చేసింది.
ఫ్యాషన్ షో..
ఈ క్రూయిజ్‌లో ఒక ఫ్యాషన్ షో (Fashion show) ప్రారంభమైంది. బాలీవుడ్ (Bollywood)నుంచి చాలా మంది ధనవంతులు, ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 1500 మంది క్రూయిజ్‌కు హాజరైనట్లు సమాచారం. ఇందులో ఢిల్లీ నుంచి పెద్ద వ్యాపారులు (Businessmen) కూడా ఉన్నారు. చాలా మందిలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో NCB పెద్ద మొత్తంలో కొకైన్, డ్రగ్స్, MD డ్రగ్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్‌లో చాలా మందిని అరెస్టు చేశారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్ బడా హీరో కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌సీబీ స్క్వాడ్ వీరందరినీ విచారించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
#UPDATE | The Narcotics Control Bureau (NCB) has seized the luggage of a few passengers after conducting a raid at a party being held on a cruise in Mumbai.
At least 10 persons were detained during the raid. pic.twitter.com/ZsC7YiNuQc
— ANI (@ANI) October 2, 2021
20 రోజులుగా వాచ్..
కాగా, ఎన్సీబీ చేసిన దాడుల్లో ఇదే అతి పెద్దదిగా చెబుతున్నారు. అంతేకాదు ఒక క్రూయిజ్‌ల ఎన్సీబీ బృందం ఈ చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి. NCB బృందం గత 20 రోజులుగా క్రూయిజ్‌ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. విచారణ ఇంకా కొనసాగుతోంది. కాగా, అక్కడ పలువురు ప్యాసింజర్ల లగేజీని అధికారులు సీజ్ చేశారు.
ఇది కూడా చదవండి:
Read this also: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arrested, Bollywood actor, Drug case, Mumbai