Honey trap: ఘరానా మోసగాడు... అమ్మాయిలకు వల... 12 మంది విలవిల

ఘరానా మోసగాడు... అమ్మాయిలకు వల... 12 మంది విలవిల

Honey trap: ఎక్కడి నుంచి వస్తారో గానీ... ఇలాంటి వాళ్లు మన సమాజంలోనే ఉంటారు. తెలివిగా మోసాలు చేస్తూ... అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు. అసలు 15 అమ్మాయిలు అతని వలలో ఎలా పడ్డారు?

 • Share this:
  Honey trap: నవీ ముంబై పోలీసులు... 32 ఏళ్ల మెకానికల్ ఇంజినీర్‌ మహేష్‌ను అరెస్టు చేశారు. అతను మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో బాగా చదువుకున్న అమ్మాయిలను వల్లో వేసుకుంటున్నాడు. వాళ్లను లైంగికంగా వేధిస్తున్నాడు. లేదా చితకబాదుతున్నాడు. ఆ తర్వాత వాళ్లను వదిలేస్తున్నాడు. ఇప్పటివరకూ 12 మందికి పైగా అమ్మాయిల జీవితాలతో అతను ఆడుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వివాహ సంబంధాలు కుదిర్చే వెబ్‌సైట్లతోనే ఈ నేరాలన్నీ చేసినట్లు తెలిపారు. నిజానికి అతని కోసం పోలీసులు 4 నెలలుగా వెతుకుతున్నారు. అతని ఒరిజినల్ పేరు మహేష్ అయినప్పటికీ... అతను కరణ్ గుప్తా పేరుతో చెలామణీ అవుతున్నాడు. ఓ పేరున్న విద్యా సంస్థలో కంప్యూటర్స్‌లో మెకానికల్ ఇంజినీర్ చేసిన మహేష్... పేరున్న కంపెనీల్లో ఉద్యోగాలు చేశాడు. టెక్నాలజీ విషయంలో అతనికి తిరుగులేని నాలెడ్జి ఉంది. ముంబైలోని మలాద్ ఏరియాలో అతన్ని అరెస్టు చేశారు.

  డీసీపీ సురేష్ మెంగడే ప్రకారం... నిందితుడు మహేష్... మాట్రిమోనియల్ సైట్‌లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత బాగా చదువుకున్న అమ్మాయిలను చెక్ చేసి... వారికి తన ప్రొపైల్ పంపి... మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చేవాడు. దాంతో... అతని ఎడ్యుకేషన్ వివరాలు చూసి... అవతలి అమ్మాయిలు కూడా ఓ మెట్టు ముందుకు వచ్చేవారు. ఆ తర్వాత వారితో మాట్లాడేందుకు మొబైల్ నంబర్ తీసుకునేవాడు. తర్వాత స్టైలిష్‌గా మాట్లాడేవాడు. లైఫుని ఎంజాయ్ చెయ్యాలి అనేవాడు. మొబైల్‌లో మాటలెందుకు... డైరెక్టుగా కలుద్దాం... అంటూ... పబ్బుల దగ్గర, మాల్స్ లేదా రెస్టారెంట్ల దగ్గర మీటింగ్ స్పాట్ పెట్టేవాడు. తీరా అక్కడిక వెళ్లాక... వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అతన్ని బలవంతంగా అడ్డుకుంటే... ఆ అమ్మాయిని చితకబాదేవాడు.

  డీసీపీ సురేష్ మంగడే ప్రకారం... నిందితుడు... ప్రతి అమ్మాయికీ వల వేసే ముందు... మొబైల్ నంబర్ మార్చేసేవాడు. ప్రతిసారీ తన మొబైల్‌లో సిమ్ కార్డులు మార్చేసేవాడు. అంతేకాదు... ఓలా, ఉబెర్ క్యాబ్ సర్వీసులు పొందేందుకు కూడా అతను నంబర్లు మార్చేస్తూ ఉన్నాడు. అతనికి సొంత పర్సనల్ నంబర్ ఉంది. దాన్ని మాత్రం ఇలాంటి వాటికి వాడేవాడు కాదు. అతను కొన్నాళ్ల కిందట హ్యాకర్‌గా కూడా పనిచేశాడు. కంప్యూటర్‌పై ఎంత నాలెడ్జి ఉండి ఏ ప్రయోజనం... దాన్ని చెడ్డపనులకు వాడుతున్నాడు.

  ఇది కూడా చదవండి: Horoscope 8-6-2021: రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలతలు

  ఇప్పటివరకూ ఈ నిందితుడు... 12 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు, చితకబాదడాల వంటివి చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఐతే... ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు అంటున్నారు. అతన్ని ఆల్రెడీ కోర్టులో ప్రవేశపెట్టి... 4 రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీలో ప్రశ్నించడం ద్వారా ఎంత మందిని మోసం చేశాడో తెలుస్తుంది. ఒకవేళ అతను అబద్ధం చెప్పినా... అతను ఇప్పటివరకూ ఎన్ని సిమ్ కార్డులు మార్చాడో తెలుసుకోవడం ద్వారా కూడా అమ్మాయిల సంఖ్యను గుర్తించవచ్చు.
  Published by:Krishna Kumar N
  First published: