రూ.10 వేలు తీసుకోని నేను చెప్పింది చేయి.. మహిళ భర్తతో 80 ఏళ్ల వృద్దుడు.. కట్ చేస్తే..

ప్రతీకాత్మక చిత్రం (image credit - youtube)

అతని వయసు 80 ఏళ్లు.. బాగా ఆస్తిపరుడు. అతనికి పలు షాపులు, ఫ్లాట్స్.. ఇలా కొన్ని కోట్లు విలువచేసే సంపద ఉంది. అయితే అతని బుద్ది మాత్రం వక్రమార్గం పట్టింది.

 • Share this:
  అతని వయసు 80 ఏళ్లు.. బాగా ఆస్తిపరుడు. అతనికి పలు షాపులు, ఫ్లాట్స్.. ఇలా కొన్ని కోట్లు విలువచేసే సంపద ఉంది. అయితే అతని బుద్ది మాత్రం వక్రమార్గం పట్టింది. ఆ వయసులో కామంతో కళ్లుమూసుకుపోయిన అతడు.. ఓ వ్యక్తి భార్యను తన వద్దకు పంపాలని కోరాడు. ఇందుకోసం రూ. 10,000 ఇస్తానని కూడా చెప్పాడు. అయితే ఈ మాటలు ఆ వ్యక్తికి కోపాన్ని తెచ్చాయి. దీంతో అక్కడ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆవేశంలో ఆ వ్యక్తి.. వృద్దుడిని హత్య చేశాడు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో(Navi Mumbai) చోటుచేసకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వివరాలు.. శమకాంత్ తుకారమ్ నాయక్(Shamakant Tukaram Naik) అనే 80 ఏళ్ల వృద్దుడికి ఉల్వేలో కోట్లు విలువ చేసే అనేక ఆస్తులను కలిగి ఉన్నాడు.

  శమకాంత్ తరచూ.. మోహన్ చౌదరి(33) అనే వ్యక్తి షాప్‌కు వెళ్లేవాడు. అతని భార్యను తనతో పడుకోబెట్టాలని కోరాడు. ఇందుకోసం రూ. 5వేలు ఇస్తానని చెప్పాడు. దీంతో మోహన్ అతనితో వాగ్వాదానికి దిగాడు. ఇక, ఆగస్టు 29న కూడా మోహన్ షాప్‌కు వెళ్లిన శమకాంత్.. రూ. 10 వేలు తీసుకుని అతని భార్యను తనతో గోడౌన్‌కు పంపాలని కోరాడు.

  Sad: చిన్నారి అల్లరి చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు.. కానీ ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా..

  శమకాంత్ డిమాండ్‌తో విసుగు చెందిన మోహన్.. అతన్ని వెనక్కి నెట్టాడు. ఈ క్రమంలోనే అతను నేల మీద పడిపోయాడు. ఆ సమయంలో అతని తల టేబుల్ కొనకు తాకడంతో రక్తస్రావం జరిగింది. దీంతో వెంటనే మోహన్ షాప్ షట్టర్‌ను మూసివేశాడు. ఆ తర్వాత శమకాంత్ గొంతు కోశాడు. అతను మరణించిన తర్వాత వాష్‌రూమ్‌లో మృతదేహాన్ని దాచిపెట్టాడు. ఆగస్టు 31 వరకు శమకాంత్ మృతదేహాన్ని బాత్‌రూమ్‌లోనే ఉంచిన మోహన్.. ఉదయం 5 గంటలకు మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి తన బైక్‌పై తీసుకెళ్లి ఉల్వే సెక్టార్ 19 లోని పడేశాడు.

  ఇదిలా ఉంటే ఆగస్టు 29 శమకాంత్ కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో శమకాంత్‌ కొడుకు శేఖర్ నాయక( Shekhar Naik) తో పాటు మోహన్ కూడా ఉన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోలీసులకు శనివారం సెక్టార్ 19లోని చెరువలో శమకాంత్ మృతదేహం లభించింది. తొలుత ఆస్తి కోసం ఈ హత్య జరిగిందని పోలీసులు భావించినప్పటికీ.. తర్వాత మోహన్ ఈ హత్య చేసినట్టుగా గుర్తించారు. ఆగస్టు 31న మోహన్ తన బైక్ వెనకాల బెడ్‌షీట్‌లో చుట్టిన శరీరాన్ని తీసుకెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలను పోలీసులు సంపాదించారు. ఇక, నిందితుడు మోహన్.. మృతుడి సెల్‌ఫోన్, దుస్తులను చెత్త డబ్బాలో పడేశానని చెప్పాడని.. కానీ అవి ఇంకా దొరకలేదని పోలీసులు చెప్పారు.
  Published by:Sumanth Kanukula
  First published: