హోమ్ /వార్తలు /క్రైమ్ /

Triangular love story: ఫ్రెండ్ ప్రియురాలిపై కన్నేశాడు.. అంతా పక్కాగా ప్లాన్ చేశాడు.. ఆరు నెలల తరువాత దొరికాడు

Triangular love story: ఫ్రెండ్ ప్రియురాలిపై కన్నేశాడు.. అంతా పక్కాగా ప్లాన్ చేశాడు.. ఆరు నెలల తరువాత దొరికాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Man killed his best friend: ప్రేన స్నేహితుడు కదా అన్ని నమ్మి ప్రియురాలిని పరిచయం చేశాడు. కానీ అతడు లేని సమయంలో ఇంటికొస్తూ ఆమెపై కన్నేశాడు.. చివరికి ఆ ఫ్రెండ్ తప్పించేశాడు.. కానీ ఆరు నెలల తరువాత ఏం జరిగిదంటే..?

Man murders friend: ప్రేమ గొప్పదా స్నేహం గొప్పదా అంటే ఫ్రిండ్ షిప్పే (Frienship) మాకు ముందు అంటారు.. వయసులో ఉన్నప్పుడు యువత ఎక్కువగా స్నేహానికే ప్రాధాన్యమిస్తున్నారు.. స్నేహం కోసం ప్రాణమైనా ఇస్తామంటారు.. అదే నిజమైన ఫ్రెండ్ షిప్ అంటే.. కానీ కామంత కళ్లు మూసుకుపోయిన కొందరు.. స్నేహితుడు అన్నపదానికి అర్థం మార్చేస్తున్నారు. ఇద్దరి స్నేహితుల మద్య అదే జరిగింది. స్నేహితుడి ప్రియురాలిపైనే.. కన్నేశాడు అతడి ఫ్రెండ్.. ఇంట్లో లేని సమయంలో.. వస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. తరుచూ తాను వెళ్లిన తరువాత తన ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాడని తెలియడంతో.. ఇద్దరూ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. ప్రాణ స్నేహితుడు (Best Friend) అని పరిచయం చేసి.. అన్ని విషయాలు చెబితే ఏంటి ఈ పాడు పని ఇద్దరినీ మందలించాడు. రోసారి ఇలా చేయొద్దని.. ప్రవర్తన మార్చుకోవాలి అంటూ హెచ్చరించాడు.. దీంతో పగ పెంచుకున్న ఆ వ్యక్తి.. అమ్మాయిని వదులుకోవడానికి ఇష్టపడ లేదు.. అతడ్ని చంపేస్తే.. ఫ్రెండ్ ప్రియురాలితో ఎంజాయ్ చేయొచ్చు అనుకన్నాడు. దీంతో అతడిని హత్య చేసి.. తరువాత తెలివిగా తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం అతడ్ని దారుణంగా చంపేశాడు.

ఈ సంఘటన ఉత్తరప్రశ్ (Uttarpradesh) చోటుచేసుకుంది. యూపీలోని మీరట్‌(Meerat) నుంచి ఆరు నెల‌ల కింద‌ట అదృశ్యమైన ఓ వ్యక్తి మిస్టరీని పోలీసులు తాజాగా చేధించారు. నిందితుడు తాగి పక్కింటి వారితో గొడవపడటంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్నేహితుడిని హ‌త్య చేసి మృత‌దేహాన్ని కాలువ‌లో ప‌డేశాడ‌ని.. మీకు అదే గతి పడుతుందని పేర్కొనడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో నిందితుడితో పాటు అత‌డి భార్యను అరెస్ట్ చేసినట్లు మీరట్‌ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: సారీ.. పొరపాటున ట్వీట్ చేశా..? సైదాబాద్ నిందితుడు దొరకలేదన్న కేటీఆర్

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. మీర‌ట్ జిల్లా కిధోర్ పట్టణానికి చెందిన‌ న‌సీం గ‌ర్‌ముక్తేశ్వర్‌లో హీనా అనే యువ‌తితో గత కొంతకాలంగా స‌హ‌జీవ‌నం చేస్తూ ఓ ఇంట్లో నివ‌సిస్తున్నాడు. ఈ క్రమంలో న‌సీం స్నేహితుడు డానిష్ తరచూ అక్కడికి వస్తుండేవాడు. నసీం ప్రియురాలు హీనాపై డానిష్‌ కన్నేశాడు. అతను లేని క్రమంలో ఇంటికి వస్తుండటంతో.. వారిద్దరి వ్యవహారం గురించి నసీంకు తెలిసింది. దీంతో డానిష్‌, హీనాను మంద‌లించాడు. దీంతో కోపం పెంచుకున్న డానిష్‌.. నసీం అడ్డు తొల‌గించుకోవాల‌నుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 17న అత‌డిని చంపి అమ్రోహ జిల్లాలోని ఓ కాలువ‌లో ప‌డేశాడు. మ‌రుస‌టి రోజే న‌సీం మృత‌దేహం (Dead body) లభ్యమైనప్పటికీ.. పోలీసులు చనిపోయిన వ్యక్తిని గుర్తించ‌లేక‌పోయారు. దీంతో మృతదేహాన్ని ద‌హ‌నం చేశారు. అనంతరం కొద్దిరోజుల‌ తర్వాత డానిష్ హీనాను వివాహం చేసుకుని అదే ప్రాంతంలో నివ‌సిస్తున్నాడు.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీపై రేపు కీలక ప్రకటన!

ఈ క్రమంలో డానిష్‌కు.. పొరుగింటి మ‌హిళ‌తో గొడవ జరిగింది. తాగిన మైకంలో ఉన్న డానిష్.. న‌సీంను తానే హ‌త్య చేశాన‌ని, ఇంకా ఎన్నో నేరాలు చేశాన‌ని.. త‌న‌తో పెట్టుకుంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయంటూ హెచ్చరించాడు. దీంతో ఈ హ‌త్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ విష‌యాన్ని మహిళ న‌సీం త‌ల్లితండ్రుల‌కు చెప్పడంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసుల విచారణలో.. న‌సీంను తానే హ‌త్య చేసి కాల‌వ‌లో ప‌డేశాన‌ని డానిష్ అంగీక‌రించాడు. ఈ మేరకు డానిష్‌, అతడి భార్య హీనాను అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Crime news, Murder, National News