Narendra giri died: అఖిల భారతీయ అఖాడా పరిషత్​ అధ్యక్షుడు నరేంద్ర గిరి స్వామీజీ ఆత్మహత్య.. శిష్యుడు అరెస్టు

నరేంద్ర గిరి (Photo: drmehulchoksi/Twitter)

అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు, ప్రముఖ స్వామీజీ, నరేంద్ర గిరి (Narendra giri) స్వామీ ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగరాజ్‌లో ఉన్న బాఘంబరి మఠంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని (hanging) ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 5 పేజీల సూసైడ్ నోట్‌ (suicide note)ను కూడా రాశారు స్వామీజీ . తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరి (Anand giri) ఇందుకు బాధ్యుడుగా మహంత్ నరేంద్ర గిరి అందులో పేర్కొన్నారు.

 • Share this:
  దేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థల్లో ఒకటైన అఖిల భారతీయ అఖాడా పరిషత్ ( All India Akhada Parishad) అధ్యక్షుడు, ప్రముఖ స్వామీజీ, మహంత్ నరేంద్ర గిరి (Narendra giri) స్వామీ ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగరాజ్‌లో ఉన్న బాఘంబరి మఠంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని (hanging) ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 5 పేజీల సూసైడ్ నోట్‌ (suicide note)ను కూడా రాశారు స్వామీజీ . తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరి (Anand giri) ఇందుకు బాధ్యుడుగా నరేంద్ర గిరి అందులో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ బృదం (forensic team)తో పాటు ఒక ప్రత్యేక బృందం ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించింది. మానసిక సమస్యలతో పాటు శిష్యుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్‌ లెటర్‌లో రాశారు నరేంద్రగిరి. తాను మరణించిన తర్వాత ఆశ్రమాన్ని ఎలా నడిపించాలో నరేంద్ర గిరి స్వామీజీ అందులో పేర్కొన్నారు.

  వీలునామా కూడా రాశారు..

  సీనియర్ పోలీస్ అధికారి కేపీ సింగ్ (KP Singh) మాట్లాడుతూ.. సూసైడ్ నోట్ చదివామని తెలిపారు. ఆయన చాలా ఆందోళన చెందినట్టు ఉన్నారన్నారు. స్వామీజీ మరణం తర్వాత (after died) ఆశ్రమంలో ఏం చేయాలో కూడా వీలునామా రూపంలో రాశారని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. కాగా, ఈ కేసులో నరేంద్ర గిరి స్వామి శిష్యుడు ఆనంద్ గిరిని హరిద్వార్‌లో అరెస్ట్ చేశారు.

  ప్రధాని సంతాపం..

  స్వామీజీ ఆత్మహత్య ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ (Yogi Aditya Nath), సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) సహ ఇతర ప్రముఖ రాజకీయ నేతలు ట్విట్టర్ (Twitter) ద్వారా తమ సంతాపం తెలియజేశారు. ‘అఖాడా పరిషత్ అధ్యక్షుడు శ్రీ నరేంద్ర గిరి స్వామీజీ మరణం చాలా విచారకరం.. ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అంకితమైనప్పటికీ సమాజంలో అనేక సమూహాలను కలపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ భగవంతుడు ఆయనకు తన పాదాల చెంత చోటు కల్పిస్తాడు.. ఓం శాంతి’ అని ప్రధాని ట్వీట్ చేశారు.  యోగి ట్విట్​..

  ‘అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు.. ఆయన ఆత్మకు భగవంతుని పాదాల దగ్గర స్థానం కల్పించాలని, ఆయన లేని బాధను తట్టుకునే శక్తిని తన అనుచరులకు ఇవ్వాలని రాముడిని ప్రార్థిస్తున్నాను’ అని యూపీ సీఎం (UP CM) యోగి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)లు సంతాపం తెలిపారు.  సీబీఐ విచారణకు డిమాండ్​..

  ఈ ప్రఖ్యాత నగరాల్లో ఉన్న ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదంటూ ఆయన ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. రామజన్మభూమి పాలక మండలిలో తమ అఖాడా పరిషత్ ప్రతినిధులను కూడా తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇవన్నీ విస్తృతంగా కొనసాగుతోన్న నేపథ్యంలోనే- మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాను ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నానని, తన తదనంతరం అఖాడా పరిషత్ బాధ్యతలను ఆనంద్ గిరి అప్పగించాలంటూ సూచించారు. మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకునేంతటి పిరికివాడు కాదని, దీని వెనుక కుట్ర ఉందంటూ అఖాడా పరిషత్ ఉపాధ్యక్షుడు దేవేంద్ర సింగ్ అన్నారు. ఆయన ఆత్మహత్య ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉందని అన్నారు. ఆయన డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
  Published by:Prabhakar Vaddi
  First published: