హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఆ మాట చెప్పి మోసం.. తొలుత మోసపోయిన వ్యక్తి ఫ్రెండ్‌కే ఫోన్ రావడంతో..

ఆ మాట చెప్పి మోసం.. తొలుత మోసపోయిన వ్యక్తి ఫ్రెండ్‌కే ఫోన్ రావడంతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తక్కువ ధరకు కిలో బంగారం ఇస్తామంటూ ఆశ చూపి మోసం చేసేందుకు యత్నించిన కర్ణాటక ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు.

తక్కువ ధరకు కిలో బంగారం ఇస్తామంటూ ఆశ చూపి మోసం చేసేందుకు యత్నించిన కర్ణాటక ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. పకడ్బందీగా వలవేసి అదుపులోకి తీసుకొని ఇంకా ఎవరైనా మోసం చేశారా వీరి వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్నారు. వివరాలు.. నారాయణపేట ప్రాంతం బంగారం, వెండికి తెలంగాణ రాష్ట్రంలోనే పేరుపొందిన ప్రదేశం. దాన్ని ఆసరా చేసుకుని కొందరు అంతరాష్ట్ర ముఠాలుగా ఏర్పడి తక్కువ ధరకు బంగారం అంటూ ప్రజలని మోసం చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏడాది కిందట తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ కర్ణాటక కు చెందిన ముఠా సభ్యులు నారాయణపేట చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేశారు. దీంతో ఆశపడ్డ ఆ వ్యక్తి కర్ణాటకకు వెళ్లి బంగారం ఇస్తానన్న వ్యక్తిని కలిశాడు. నమూనాగా కొంత బంగారం ఉచితంగా ఇచ్చి అసలుదని నమ్మితేనే కాల్‌ చేయమని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత బంగారం అసలుదని తేలడంతో మళ్లీ ఆ ముఠాకు ఫోన్‌చేసి రూ.10లక్షలు ఉన్నాయని కిలో బంగారం ఇవ్వాలని కోరాడు. రమ్మని చెప్పడంతో స్నేహితులతో కలిసి కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు వెళ్లాడు. పక్కా ప్రణాళికతో ఉన్న ముఠా సభ్యులు బంగారం ఆశతో వెళ్లిన పేటకు చెందిన వ్యక్తుల నుంచి రూ.10 లక్షలు తీసుకుని బెదిరించి పంపించారు.

అప్పట్లో జరిగిన ఈ సంఘటన కొంత ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇటీవలే మళ్లీ కర్ణాటక నుంచి బంగారం తక్కువ ధరకు ఇస్తానంటూ నారాయణపేటకు చెందిన మరో వ్యక్తి కి ఫోన్ వచ్చింది. దీంతో అదే తరహాలో ఏడాది కిందట మోసపోయిన తన స్నేహితుడికి విషయం చెప్పాడు. ఇంతకుముందు మోసం చేసిన ముఠా సభ్యులలో ఒక్కడు ఫోన్ చేసి దీంతో ఇదే తరహాలో ఏడాది కిందట మోసపోయిన తన స్నేహితుడికి విషయం చెప్పాడు. ఇంతకు ముందు మోసం చేసిన వ్యక్తుల పనేనని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సూచన మేరకు నమూనాగా బంగారం తీసుకునేందుకు వస్తున్నట్లు తెలిపి ముఠాను కలిసేందుకు శివమొగ్గ ప్రాంతానికి వెళ్లారు.

నారాయణపేట వ్యక్తులతో ముఠాలోని నలుగురు సభ్యులు చర్చ్ ఇస్తుండగా పక్కా ప్రణాళికతో వెళ్ళిన పోలీసు బృందం చాకచక్యంగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది ఇదివరకు డబ్బులు తీసుకొని బెదిరించిన విషయం దాని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పూర్తిస్థాయి విచారిస్తున్నట్లు తెలిసింది ఈ విషయమై నారాయణపేట సీఐ శ్రీకాంత్ రెడ్డి సంప్రదించగా విచారణ సాగుతోందని తెలిపారు.

First published:

Tags: Gold, Karnataka, Telangana Police

ఉత్తమ కథలు