అక్కాచెల్లెళ్లపై రేప్ కేసు.. ఆశారాం కుమారుడికి ఊహించని శిక్ష విధించిన కోర్టు

ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయి తమపై అత్యాచారం చేశారని గుజరాత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు స్థానిక పోలీసు స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: April 30, 2019, 6:27 PM IST
అక్కాచెల్లెళ్లపై రేప్ కేసు.. ఆశారాం కుమారుడికి ఊహించని శిక్ష విధించిన కోర్టు
నారాయణ్ సాయి(ఫైల్)
  • Share this:
ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయికి జీవిత ఖైదు పడింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను దారుణంగా అత్యాచారం చేసిన కేసులో అతడు దోషి అని తేలగా మంగళవారం శిక్ష ఖరారైంది. ఈ మేరకు సూరత్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయి తమపై అత్యాచారం చేశారని గుజరాత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు స్థానిక పోలీసు స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. 2013లో నమోదైన ఈ కేసులో ఆరేళ్ల తర్వాత నారాయణ్‌ సాయిపై అభియోగాలు రుజువయ్యాయి. అతడు అత్యాచారం చేశాడని గత శుక్రవారం కోర్టు తేల్చింది. తాజాగా శిక్షను ఖరారు చేసింది. మరోవైపు, వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఓ మహిళను పలుమార్లు అత్యాచారం చేశాడని నారాయణ్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇతడు చాలా కేసుల్లో నిందితుడు.

కాగా, అక్కాచెల్లెళ్లపై రేప్ కేసులో గంగా,జమున, హనుమాన్‌ కూడా దోషులుగా కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఆశ్రమం పేరిట ఆశారాం బాపూ అరాచకాలు చేశాడనే వాదనలున్నాయి. మైనర్ బాలికలను కూడా రేప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. పైగా అత్యాచారం చేయడం పాపం కాదని చెబుతుండేవాడట. చివరకు ఓ రేప్ కేసులో దోషిగా తేలి ప్రస్తుతం జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తండ్రి బాటలోనే ఇప్పుడు తనయుడు కూడా జైలు బాట పట్టాడు.
First published: April 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading