చెప్పింది చేయకపోతే ఫెయిల్ చేస్తా.. కీచక ప్రొఫెసర్ లైంగిక వేధింపులు

తమ సెల్‌ఫోన్‌లకు అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్నాడని పలువురు విద్యార్థినులు రిజిస్ట్రార్‌కి ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: October 18, 2019, 3:13 PM IST
చెప్పింది చేయకపోతే ఫెయిల్ చేస్తా.. కీచక ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఉన్న నన్నయ్య యూనివర్సిటీలో ఓ కీచక ప్రొఫెసర్ లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది. ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్‌ హెచ్ఓడీగా పనిచేస్తున్న నిమ్మగడ్డ సూర్యరాఘవేంద్ర అనే ప్రొఫెసర్ విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు వైస్ ఛాన్సలర్‌కి దృష్టికి వచ్చింది. తమ సెల్‌ఫోన్‌లకు అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్నాడని పలువురు పీజీ విద్యార్థినులు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తాను చెప్పినట్టు చేయకుంటే ఇంటర్నెల్స్‌లో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. విద్యార్థులను మానసికంగా లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు.దీంతో రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రార్ ఫిర్యాదుతో నందిగామలోని స్వగృహంలో పోలీసులు గురువారం సాయంత్రం సూర్య రాఘవేంద్రను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 489/2019 354(A), 354(D), 509, 506 కింద కేసులు నమోదు చేశారు.అనంతరం సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.ఈకేసులో ప్రత్యేక విచారణ అధికారిగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ శ్రావణి
వ్యవహరిస్తున్నారు.


(విద్యార్థినిలు వైస్ ఛాన్సలర్‌కి రాసిన లేఖ)

First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు