• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • NALGONDA YOUTH PRAVEEN RAO SUSPICIOUS DEATH IN CANADA FIVE YEARS AFTER HE WENT TO THERE FOR HIGHER STUDIES HSN

కెనడాలో ఘోరం.. భవనంపై నుంచి దూకి తెలుగు కుర్రాడు ఆత్మహత్య.. తల్లిదండ్రులకు విషయం తెలిసి..

కెనడాలో ఘోరం.. భవనంపై నుంచి దూకి తెలుగు కుర్రాడు ఆత్మహత్య.. తల్లిదండ్రులకు విషయం తెలిసి..

ప్రవీణ్ రావు (ఫేస్ బుక్ ఫొటో)

ఉన్నత చదువులు చదివేందుకని విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఉంటున్న భవనం మీద నుంచి దూకి మరీ దారుణానికి ఒడిగట్టాడు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • Share this:
    క్షణికావేశంలో యువత దారుణ నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు మందలించారనో, ఉపాధ్యాయులు తిట్టారనో యువకులు ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రేమ విఫలమవుతున్న సందర్భాల్లో కూడా ఉసురు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఉన్నత చదువులు చదివేందుకు విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు కుర్రాడు విగతజీవిగా మారాడు. తాను నివాసం ఉంటున్న భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి అతడితో పాటు ఉంటున్న వారికి సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మృతిచెందాడు. కెనడా దేశంలో చదివుకునేందుకు వెళ్లిన నల్లగొండ విద్యార్థి చేసిన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    నల్లగొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన నారాయణరావు, హైమావతి దంపతులకు ప్రవీణ్ రావు అనే కుమారుడు ఉన్నాడు. ప్రవీణ్ రావు ఉన్నత విద్యాభ్యాసం కోసం 2015వ సంవత్సరంలోనే కెనడా దేశానికి వెళ్లాడు. ప్రవీణ్ రావు తల్లిదండ్రులది వ్యవసాయమే ప్రధాన ఆధారంగా జీవిస్తున్న కుటుంబం. వ్యవసాయం చేస్తూనే కొడుకును ఆ తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివిస్తున్నారు. రోజూ ఒక్కసారైనా కెనడాలో ఉన్న కొడుకుతో మాట్లాడుతూ ఉంటారు. అయితే సడన్ గా గురువారం ఉదయం తాను ఉంటున్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్ హాస్టల్లో ఘోరం.. నాన్నా.. నన్ను క్షమించు.. అన్నా.. నేను తప్పు చేయలేదురా అంటూ.. మెసేజ్ పెట్టి మరీ..

    స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రవీణ్ మృతి చెందాడు. ఈ ఘటన గురించి తెలిసిన నారాయణరావు, హైమావతి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోజూ తమతో మాట్లాడుతుంటాడనీ, ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనడాలోనే కాలేజీలోనో, తన స్నేహితులతోనో ఏదో జరిగి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ మృతదేహాన్ని వీలయినంత త్వరగా స్వస్థలానికి తెప్పించేలా అధికారులు కృషి చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
    ఇది కూడా చదవండి: బీటెక్ కుర్రాడు.. డిగ్రీ యువతి.. రాత్రి 10.30గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ ఆ యువతి బయటకు వచ్చి..
    Published by:Hasaan Kandula
    First published: