12 మంది బాలికలను మూడు నెలల పాటు అత్యాచారానికి గురి చేసిన ఓ కీచక టీచర్‌తో సహరికరించిన మరోకరికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. మరోవైపు టీచర్ వ్యవహారాన్ని పోలీసులకు తెలియకుండా దాచిన ఆ ట్యూషన్ మహిళా మేనేజర్‌కు సైతం ఆరునెలల జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమాన విధించింది.
కేసు పూర్వపరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ఏనమీది తండాలో వీలేజ్ రీకన్ట్రక్షన్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థను 1996లోనే ఏర్పాటు చేసింది. గిరిజన పిల్లలకు చదువు చెప్పేందుకు ఏ పాఠశాలను సైతం ఏర్పాటు చేసింది. దీంతోపాటు వారికి ట్యూషన్ సౌకర్యాన్ని కల్పించింది. ఇందుకోసం అదే గ్రామంలోని రమావత్ హరీశ్‌ను ట్యూటర్‌గా నియమించింది. కాగా హరీష్ ట్యూషన్‌కు వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా మూడు నెలల పాటు 12 బాలికలపై అత్యాచారం జరిగినట్టు 2014 జనవరిలో బయటపడింది. దీంతో ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. రాజకీయంగా దుమారం రేపింది. అత్యంత దారుణమైన ఘటనపై అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం స్పందించి వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కాగా అప్పటి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
Telangana News : అయ్యో పాపం .. కడుపులో ఉన్న శిశువు ఏం చేసిందమ్మా... నిండు గర్భిణి దారుణం..!
Vanama Raghava : నా కొడుకు ఎక్కడ ఉన్నా పట్టిస్తా.. రాజకీయాలకు దూరంగా ఉంచుతా.. ఎమ్మెల్యే బహిరంగ లేఖ.
ఈ కేసు సుమారు 11 సంవత్సరాల పాటు విచారణ జరిగింది. ప్రధాన నిందితుడు హరీష్‌కు యావజ్జీవ శిక్ష విధించడంతో పాటు నిందితుడికి సహకరించిన శ్రీనివాసరావుకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా, ట్యూషన్ మేనేజర్ గా ఉన్న సరితకు 6నెలల జైలు శిక్ష 10 వేల జరిమానా విధించారు. కాగా సరితకు ఈ కేసులో బెయిల్ లభించినట్టు తెలుస్తోంది. జైలు శిక్ష పడిన నిందితులను నల్గొండ జిల్లా జైలుకు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.