దుకాణానికి వచ్చిన మహిళను చంపి.. ఆపై మృతదేహాంతో శృంగారం..

మహిళ మృతదేహాన్ని ఓ వ్యానులో ఎక్కించి రహదారి పక్కన ఆపేశాడు. అయితే మహిళ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పాల అమ్ముకుని జీవనం సాగించే ఆమె భర్త నలసోపారాలోని తులింగ్ పోలీసులకు తన భార్య తప్పి పోయిందని ఫిర్యాదు చేశాడు.

news18-telugu
Updated: July 4, 2020, 12:39 PM IST
దుకాణానికి వచ్చిన మహిళను చంపి.. ఆపై మృతదేహాంతో శృంగారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తి తన దుకాణంలో షాపింగ్ చేసేందుకు వచ్చిన మహిళను గొంతు కోసి చంపాడు. అంతటితో ఆగకుండా ఆమె మృతదేహంపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని నలసోపారాకు చెందిన ఓ 25 ఏళ్ల మహిళ జూన్ 26న ఇంటిలో నుంచి కిరాణ సామగ్రి తెచ్చేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే తన పిల్లలకు బొమ్మలు కొనేందుకు ఆ మహిళ ఓ బొమ్మల దుకాణంలోకి వెళ్లింది. ధర విషయంలో మహిళా దుకాణ యాజమానితో వాగ్వాదానికి దిగింది. దీంతో ఆగ్రహించిన దుకాణ యజమాని మహిళను జుట్టు పట్టుకని దుకాణం వెనుక ఉన్న గదిలోకి లాక్కెళ్లాడు. మహిళ అరుస్తుండగా గొంతు కోసి ఆమెపై లైంగిక దాడి చేశాడు. అనంతరం మహిళ మృతదేహాన్ని ఓ వ్యానులో ఎక్కించి రహదారి పక్కన ఆపేశాడు.

అయితే మహిళ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పాల అమ్ముకుని జీవనం సాగించే ఆమె భర్త నలసోపారాలోని తులింగ్ పోలీసులకు తన భార్య తప్పి పోయిందని ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 4, 2020, 12:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading