అర్ధరాత్రి నగ్నంగా ఇళ్ల తలుపులు తడుతూ..

అర్ధరాత్ని నగ్నంగా తిరుగుతూ.. ఇళ్ల తలుపులు తడుతున్నాడు. మిస్టరీగా మారిన ఈ వ్యవహారం సీసీటీవి ఫుటేజీతో ఎట్టకేలకు బయటపడింది.

news18-telugu
Updated: October 16, 2019, 11:29 AM IST
అర్ధరాత్రి నగ్నంగా ఇళ్ల తలుపులు తడుతూ..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 16, 2019, 11:29 AM IST
తమిళనాడులోని కడలూరు జిల్లా వీఎన్ఆర్ నగర్‌లో ఓ దొంగ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. అర్ధరాత్ని నగ్నంగా తిరుగుతూ.. ఇళ్ల తలుపులు తడుతున్నాడు. మిస్టరీగా మారిన ఈ వ్యవహారం సీసీటీవి ఫుటేజీతో ఎట్టకేలకు బయటపడింది. నిందితుడిని దర్జీ రంజాన్ అలీ(45)గా గుర్తించారు. ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున వీఎన్ఆర్ నగర్‌లో అలీ పలు ఇళ్ల తలుపులు తట్టాడు. మరుసటి రోజు ఉదయం కాలనీ వాళ్లంతా దీనిపై చర్చించారు. సీసీటీవి ఫుటేజీని తీసి పరిశీలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అలీగా గుర్తించారు.అతను నిజంగానే దొంగా... లేక మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...