తెలంగాణ అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి

రంగారెడ్డి జిల్లా.. కడ్తాల్‌కు చెందిన నాగులు అనే వ్యక్తి అబిడ్స్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేసేవాడు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల నాగులు ఉపాధి కోల్పోయాడు.

news18-telugu
Updated: September 12, 2020, 6:04 PM IST
తెలంగాణ అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు చనిపోయాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న నాగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా.. కడ్తాల్‌కు చెందిన నాగులు అనే వ్యక్తి అబిడ్స్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేసేవాడు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల నాగులు ఉపాధి కోల్పోయాడు. దాంతో కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. ఉపాధి దొరకకపోవడంతో విసుగుచెందిన నాగులు.. అసెంబ్లీ వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పెట్రోల్ పోసుకొని మంటలు అంటుకున్నా కూడా.. నాగులు మాత్రం కేసీఆరే కాపాడాలని నినాదాలు చేశాడు. అసెంబ్లీ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు.. వెంటనే అప్రమత్తమై నాగులుని ఆటోలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోచికిత్స పొందుతూ చనిపోయాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 12, 2020, 6:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading